Covid cases: దేశంలో కొత్తగా 2,380 కొవిడ్ పాజిటివ్ కేసులు.. ఢిల్లీలో భారీగా పెరిగాయ్..

దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ ..

Covid cases: దేశంలో కొత్తగా 2,380 కొవిడ్ పాజిటివ్ కేసులు.. ఢిల్లీలో భారీగా పెరిగాయ్..

Covid Cases

Covid cases: దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండటాన్ని గుర్తించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖకు లేఖలు రాసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలా ప్రకారం.. బుధవారం మొత్తం 4.49 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,380 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో నిన్నటి కేసులతో పోల్చితే గురువారం ఒక్కరోజే 60శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పాజిటివిటీ రేటు 5.7శాతానికి పెరిగింది. దేశంలో గడిచిన 24గంటల్లో 56 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

కొద్దిరోజులగా కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. బుధవారం సాయంత్రం వరకు కొవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 13,433గా ఉంది. బుధవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 15.47 లక్షల మందికి టీకా ఇచ్చారు. దంతో ఇప్పటి వరకు 187 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడింది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో తాజాగా 1,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సంగం వరకు ఢిల్లీలోనే నమోదు కావటం గమనార్హం. దీనికితోడు కేరళలలోనూ కొవిడ్ కేసుల తీవ్ర పెరుగుతుంది. కొవిడ్ తో చికిత్స పొందుతూ దేశవ్యాప్తంగా 24గంటల్లో 56 మంది మరణిస్తే ఒక్క కేరళ రాష్ట్రంలోనే 53 మంది మృతి చెందడం ఆ రాష్ట్రంలో కొవిడ్ ఉదృతిని తెలియజేస్తుంది.

Covid cases : ఐదు రాష్ట్రాల్లో పెరిగిన కొవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..

మరోవైపు కొవిడ్ పాజిటివ్ కేసుల్లో 97శాతం నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో మూడవ వేవ్ కు కారణమైన విషయం విధితమే. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ దేశంలోకి వచ్చిందన్న వాదన తెరపైకొచ్చింది. ఫోర్త్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.