India covid 19 : ఇండియాకు కాస్త రిలీఫ్, కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.

India covid 19 : ఇండియాకు కాస్త రిలీఫ్, కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..

india reports 24,492 new covid 19 cases : దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం(మార్చి 14,2021) 26 వేలకుపైగా కేసులు నమోదుకాగా.. నిన్న 24వేల 492 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8.73లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

2లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
గడిచిన 24 గంటల్లో 131 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,58,856కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 23వేల 432కి పెరిగింది. కొత్తగా 20,191 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,27,543కు చేరి.. రికవరీ రేటు 96.65గా నమోదైంది.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ:
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ అత్యధిక కేసులు రికార్డ్ అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం.

తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు:
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 16,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,656కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 170 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,015 ఉండగా.. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 92,99,245మందికి కరోనా పరీక్షలు చేశారు.