COVID Antibodies : నాలుగు నెలల్లోనే తగ్గుతున్న యాంటీ బాడీలు

మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.

COVID Antibodies : నాలుగు నెలల్లోనే తగ్గుతున్న యాంటీ బాడీలు

Drop In Covid Antibodies

COVID Antibodies : మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. భారత దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ స్టడీకి సంబంధించిన డేటాను విడుదల చేశారు. రెండు డోసులు టీకా తీసుకున్న 614 మంది హెల్త్‌వర్కర్లపై చేసిన సర్వే ఆధారంగా ఈనివేదికను  రూపోందించి విడుదల చేశారు.

యాంటీబాడీలు త‌గ్గుతున్నంత మాత్రాన‌.. ఆ వ్య‌క్తిలో వ్యాధి నిరోధ‌క శక్తి పోతుందని చెప్ప‌లేమ‌ని అందులో పేర్కోన్నారు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లో ఉన్న రీజిన‌ల్ మెడిక‌ల్ రీస‌ర్చ్ సెంట‌ర్ దీనిపై స్ట‌డీ చేసింది.  ఆరు నెల‌ల త‌ర్వాత మాత్ర‌మే బూస్ట‌ర్ డోసు ఎప్పుడు అవ‌స‌రం వ‌స్తుందో చెప్ప‌గ‌ల‌మ‌ని  ఆర్ఎంఆర్సీ  డాక్ట‌ర్ సంగ‌మిత్ర ప‌తి తెలిపారు. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుతున్న వేర్వేరు  అధ్యయనాలను  క్రోడీక‌రించాల‌ని ఆయన అన్నారు.
Read Also : Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం

టీకాలు తీసుకున్న ఆరు నెల‌ల్లోనే యాంటీబాడీలు   క్ర‌మంగా త‌గ్గుతుంటాయ‌ని ఇటీవ‌ల బ్రిటీష్ ప‌రిశోధ‌కులు చెప్పిన విష‌యం తెలిసిందే. ఫైజ‌ర్‌, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న‌ వారిలో ఈ మార్పు క‌నిపించిన‌ట్లు తెలిపారు.  ఇండియ‌న్ స్ట‌డీకి సంబంధించిన నివేదిక‌ను రీస‌ర్చ్ స్క్వేర్‌లో   ప‌బ్లిష్ చేశారు. కోవీషీల్డ్‌, కోవాగ్జిన్ తీసుకున్న‌వారిలో ఈ స్ట‌డీ చేశారు. బారతదేశంలో   బూస్ట‌ర్ డోసులు అందించాలా వద్దా అని నిర్ణయించటానికి ఈ ఫలితాలు సహాయ పడతాయి.

బూస్టర్ డోస్ పై అధ్యయనం చేస్తున్నప్పటికీ ….దేశంలోని యువ‌త‌కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 60 శాతం మందికి క‌నీసం ఒక డోసు టీకా అందిన‌ట్లు అధికారులు తెలిపారు. దేశంలో 19 శాతం మందికి రెండో డోసు టీకా అందుకున్నారు.

Read Also : Booster Dose: బూస్టర్ డోస్‍‌లు అవసరం లేదంటున్న సైంటిస్టులు