Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్.. దేశంలో 1500 దాటిన కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.23గా ఉంది.

Covid-19: దేశంలో మరోసారి కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,590 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.23గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 4,47,02,257. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,824. మరణాల శాతం 1.19. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కరు చొప్పున మరణించారు. యాక్టివ్ కేసుల శాతం 0.02కాగా, రికవరీ రేటు 98.97గా ఉంది.
దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్‌లతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ అయిన ఎక్సబీబీ.1.16 రకం వైరస్ వ్యాపిస్తోంది. అయితే, ఇది అంతగా ప్రమాదకరం కాదని నిపుణులు అంటున్నారు.