JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల

దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది.

JEE Advanced Exam : జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల

JEE ADVANCED

JEE Advanced Exam : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4 న పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి మే 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకునే అవకాశం ఉంది.

పరీక్ష ఫీజు చెల్లింపుకు మే5వ తేదీ వరకు వెసులుబాటు కల్పించారు. మే 29 నుంచి జూన్ 4వ తేదీ వరకు
అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2023 ఏడాదికి గానూ ఈ పరీక్ష నిర్వహిస్తుండటంతో ఐఐటీ గువాహటి ప్రత్యేక బ్రోచర్ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్ డ్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనుంది.

JEE Advanced New Syllabus : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు కొత్త సిలబస్‌

ఈ రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సివుటుంది.  తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యపేట, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, మహబూబ్ నగర్ సెంటర్లలో పరీక్ష జరుగనుంది. జూన 4వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐఐటీ గువాహటి స్పష్టం చేసింది.

ఇప్పటికే  జేఈఈ మెయిన్-2023 పరీక్ష తేదీలను ఎన్టీఏ విడుదల చేసింది. తొలి సెషన్ ను జనవరి 24, 25, 27, 29, 30, 31వ తేదీల్లో జరుగనుంది. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది.
మరోవైపు జేఈఈ మెయిన్ -2023 పరీక్షల తేదీలను మార్చాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది. తేదీలను ప్రకటించిన నెలకే పరీక్ష నిర్వహించడం తగదని తెలిపింది. అంతేకాకుండా పరీక్షకు 75 శాతం అర్హతను కూడా తొలగించాలని కోరింది.