Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.

Karthi Chidambaram : మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. చైనీస్ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలపై కార్తీ చిదంబరం సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సీబీఐ సమన్లు జారీ చేసింది.
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు కార్తీ చిదంబరం హాజరు కానున్నట్లు సమాచారం.
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
కార్తీ చిదంబరం మధ్యాహ్నం 2 నుంచి 4గంటల సమయంలో సీబీఐ విచారణకు రావచ్చని తెలుస్తోంది. ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని సీబీఐ అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని… కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని న్యాయవాదికి చెప్పి పంపినట్లు వెల్లడించారు.
కార్తీ చిదంబరం న్యాయవాదులు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు ఈడీ నమోదు చేసింది. 263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో… సీబీఐ కేసు ఆధారంగా ఈడీ..మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
- Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
- OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
- IPL Cricket Betting : పాకిస్తాన్ టు హైదరాబాద్.. 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
- Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
- AAP: ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
1Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
2Jasprit Bumrah: భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్‌కి 35 ఏళ్ళ తర్వాత తొలిసారి ఛాన్స్..
3Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
4Happy Birthday Chor : దొంగకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అపార్ట్ మెంట్ వాసులు
5Maharashtra: రేపు బలపరీక్ష.. నేడు కీలక నిర్ణయాలు తీసుకున్న మహారాష్ట్ర కేబినెట్
6Samsung Galaxy M32 : భారత్‌లో గెలాక్సీ M32 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్..!
7Hyderabad : వ్యాపారం పేరుతో రూ.13 కోట్లు మోసం చేసిన ఇద్దరు అరెస్ట్
8KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
9Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
10Abhyas: ‘అభ్యాస్’ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!
-
Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!
-
Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
-
Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!
-
Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు
-
WhatsApp : వాట్సాప్ గ్రూపులో ఇకపై సైలెంటుగా ఎగ్జిట్ కావొచ్చు.. వారికి మాత్రమే తెలుస్తుంది..!
-
Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?