Corona-Free Village : మహారాష్ట్రలో కరోనా ఫ్రీ విలేజ్ కాంటెస్ట్.. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీ

కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

Corona-Free Village : మహారాష్ట్రలో కరోనా ఫ్రీ విలేజ్ కాంటెస్ట్.. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీ

Corona Free Village

Corona-Free Village : కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర గ్రామాల్లోని స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా ‘కరోనా రహిత గ్రామం’ (Corona-Free Village) పోటీని ప్రకటించింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్బంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. కరోనాపై అవగాహనతో పాటు వైరస్‌ కట్టడి కోసం ఈ పోటీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ‘మై విలేజ్ కరోనా ఫ్రీ’లో భాగమని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ పేర్కొన్నారు. కరోనా కట్టడిలో విజయవంతమైన మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు బహుమతి ఇవ్వనున్నారు. మొదటి బహుమతి కింద రూ. 50 లక్షలు, రెండో బహుమతి కింద రూ.25 లక్షలు, మూడో బహుమతి కింద రూ. 15 లక్షల వరకు అందించనున్నారు.

ఈ పోటీలో పాల్గొనే గ్రామాలను 22 ప్రమాణాల ఆధారంగా ఏర్పాటు చేసిన కమిటీ ఎవరూ విజేతనో నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో 6 రెవెన్యూ విభాగాలు ఉండగా మొత్తం 18 బహుమతులు ఉంటాయి. ఇందుకోసం రూ.5.4 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. పోటీలో గెలిచిన గ్రామాలకు ప్రోత్సాహకంగా బహుమతి డబ్బుతో సమానమైన అదనపు మొత్తం కూడా లభిస్తుందని ఆయన అన్నారు. ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తామన్నారు.

మహారాష్ట్ర సీఎం ఠాక్రే స్థానిక ప్రజా ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని అతి పిన్న వయస్సులో సర్పంచ్ అయిన షోలాపూర్ జిల్లా ఘాట్నే గ్రామ సర్పంచ్ రుతురాజ్ దేశ్ ముఖ్ (21)ను ఠాక్రే ప్రశంసించారు. అతడు తన గ్రామంలో కరోనా వైరస్ లేకుండా చేస్తున్న కృషిని అభినందించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 14,123 కొత్త కోవిడ్ కేసులు, 477 మరణాలు నమోదయ్యాయి.