Padma Shri Tulasi Gowda: కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ

తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Padma Shri Tulasi Gowda: కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ

Padma Awadee Tulasi Gowda

Padma Shri Tulasi Gowda: తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో కేవలం చీర మాత్రమే ధరించి.. చెప్పుల్లేని కాళ్లతోనే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసీ గౌడను నాలుగో అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించారు.

కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడ. పేద కుటుంబానికి చెందిన ఆమె.. జీవితంలో ఎప్పుడూ రెగ్యూలర్ చదువులు చదువుకోలేదు. అయినప్పటికీ ఆమెను ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఔషద మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు.

ఆమెకు 12ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లో టెంపరరీ వాలంటీర్ గా కూడా జాయిన్ అయ్యారు. ప్రకృతిపై ఆమెకున్న డెడికేషన్ అక్కడే గుర్తింపుకొచ్చింది. ఆ తర్వాత అదే డిపార్ట్‌మెంట్ లో ఆమె జాబ్ పర్మినెంట్ అయింది.

 

………………………………….: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు

అంతేకాకుండా 72ఏళ్ల వయస్సులోనూ.. యువతకు సూచనలిస్తూ మొక్కలు నాటడం గురించి చెప్తుంటారు. వాటిలో మెలకువల గురించి వివరిస్తుంటారు.

పద్మ అవార్డ్స్ 2021:
రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 10మందికి పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందజేశారు. 29మంది మహిళలు ఉండగా, ఒక ట్రాన్స్‌జెండర్ కు అవార్డు దక్కింది.

ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్ లాంటి పలు విభాగాల్లో నుంచి పద్మ అవార్డులకు ఎంపిక చేశారు.

………………………………………….: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్