Tiktok పై మైక్రోసాప్ట్ ప్రకటన

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 12:23 PM IST
Tiktok పై మైక్రోసాప్ట్ ప్రకటన

Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది.



దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతాయని, ఈ చర్చలు సెప్టెంబర్ 15 కల్లా పూర్తవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. టిక్ టాక్ కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే నేపథ్యంలో మైక్రో సాఫ్ట్ ఈ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సమాచార భద్రతకు ముప్పు రాకుండా..టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, అమెరికా దేశానికి ఆర్థిక లాభం వచ్చే విధంగా చూస్తామని తెలిపింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది.



టిక్ టాక్ ను భారతదేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలో మైక్రసాప్ట్ రంగంలోకి దిగి బైట్ డాన్స్ లో చర్చలు జరుపుతోంది. మైక్రోసాప్ట్ సీఈవో నాదెళ్ల వారితో సమావేశమై..చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

టిక్ టాక్ బ్యాన్ చేయడం ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యాన్ని అడ్డుకోవాలని 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు.