BJP Govt Formation : గోవా,ఉత్తరాఖండ్ సీఎంల పేర్లు ప్రకటించనున్న బీజేపీ

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది. 

BJP Govt Formation : గోవా,ఉత్తరాఖండ్ సీఎంల పేర్లు ప్రకటించనున్న బీజేపీ

Narendra Modi, Amith Shah

BJP Govt Formation :  ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది.  నాలుగు రాష్ట్రాలకు పర్యవేక్షకులను ఎంపిక చేసిన బీజేపీ ఈ రోజు గోవా ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎం ల పేర్లు ప్రకటించనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా,మణిపూర్ లో బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుంది.

యుపి పర్యవేక్షకులుగా  అమిత్ షా,రఘుబర్ దాస్ నియామకం కాగా…. ఉత్తరాఖండ్ పర్యవేక్షకులుగా  రాజ్ నాథ్ సింగ్,మీనాక్షి లేఖి….గోవా పర్యవేక్షకులుగా  నరేంద్ర సింగ్ తోమర్,ఎల్.మురుగన్… మణిపూర్ పర్యవేక్షకులుగా  నిర్మలాసీతారామన్,కిరెన్ రిజిజు నియామకం జరిగింది.

కాగా ఈనెల 25 న యోగి ఆదిత్యనాథ్ రెండో సారి యూపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మణిపూర్ సీఎం గా ఎన్ బీరెన్ సింగ్ ను బీజేపీ ఖారారు చేసింది.  ఈరోజు గోవా ఉత్తరాఖండ్ సీఎంల పేర్లు ప్రకటించనుంది. పా ర్టీ అగ్రనేతలు బేజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్ లు నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

గోవా పరిశీలకులుగా ఎంపికైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగున్ ఈరోజు గోవా వెళతారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఎంపికైన ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. శాసనసభా పక్షం నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పీఎస్ శ్రీధర్ పిళ్లైని కలవనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు మరో సారి పదవి దక్కే అవకాశం ఉందని కొందరుచెపుతుండగా… గోవాలో పార్టీ మెరుగు పరుచుకోవటంతో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి విశ్వజిత్ రాణే కూడా  సీఎం  రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Paddy Politics : వరి ధాన్యం వార్-ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
ఉత్తరాఖండ్ లో పార్టీ విజయం సాధించినప్పటికీ తాత్కాలిత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఎన్నికల్లో ఓడిపోవటంతో మరింత అనిశ్చితి ఏర్పడింది. నిన్న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు జేపీ నడ్డాతో పాటు ధామి,రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు త్రివేంద్ర సింగ్ రావత్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సత్పాల్ మహరాజ్ హాజరయ్యారు.