PM Modi : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన ప్రధాని మోడీ

అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన ప్రధాని మోడీ

America (1)

PM Modi America tour : అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ గెలవడం చారిత్రాత్మకమని అన్నారు. ప్రపంచానికి కమలా హారిస్‌ ఒక స్ఫూర్తి అని ప్రసంశలు కురిపించారు. బైడెన్‌, కమలా హారిస్‌లతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుందన్నారు. కమలా హారిస్‌ను దేశ ప్రజల తరఫున ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.

ప్రధానితో భేటీలో అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అని అన్నారు కమలా హారిస్. టీకా ఎగుమతుల పునురుద్ధరణపై భారత్‌ ప్రకటనను స్వాగతించారామె. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్‌ వనరుగా ఉందని అన్నారు. సెకండ్ వేవ్‌లో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉందని తెలిపారు కమలా. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నట్లు తెలిసిందని.. అది అభినందనీయమని తెలిపారు ఆమె.

PM Modi: కమలాహారిస్‌ను ఇండియాకు ఆహ్వానించిన ప్రధాని మోదీ

ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని కమలా హారిస్‌ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని తెలిపారు. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు కమలా హారిస్‌. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ.. జూన్‌ నెలలో ఈ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నప్పటికీ వ్యక్తిగతంగా సమావేశమవడం ఇదే తొలిసారి.

కమలా హారిస్‌తో భేటికి ముందే.. అమెరికా పర్యటనలో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేలా.. ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయ్‌. కరోనాపై పోరు, వాణిజ్యం, రక్షణ సహా కీలక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునేలా ఇరువురు చర్చించారు.