Ayodhya Deepotsav: నేడు అయోధ్యలో దీపోత్సవ్.. 18లక్షల మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తి.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

సరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున కాల్చడంతో పాటు మ్యూజికల్ లేజర్ షోనూ నిర్వహించనున్నారు.

Ayodhya Deepotsav: నేడు అయోధ్యలో దీపోత్సవ్.. 18లక్షల మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తి.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

Ayodhya Deepotsav

Ayodhya Deepotsav: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలో దీపావళికి ఒక్కరోజు ముందు ప్రతీయేటా నిర్వహించే దీపోత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నీస్  బుక్ రికార్డును సృష్టించేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి తో పాటు 37 ఘాట్లలో మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా  3డీ హోలో గ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోతో పాటు గ్రౌండ్ లో మ్యూజికల్ లేజర్ షోను కూడా మోదీ వీక్షిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు

యూపీలో యోగి ఆధిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించే దీపోత్సవ్ 6వది. ఈ దీపోత్సవ్ లో భాగంగా మొత్తం 18లక్షల మట్టి ప్రమిదలను వెలించనున్నారు. 15లక్షలకుపైగా మట్టి ప్రమిదలను 22వేల మంది వాలంటీర్లు వెలిగిస్తారు. వాలంటీర్లు ఒక చతురస్రాకారంలో 256 మట్టి దీపాలను ఏర్పాటు చేస్తారని, రెండు కూడళ్ల మధ్య దూరం దాదాపు రెండు నుంచి మూడు అడుగుల వరకు ఉంటుందని దీపోత్సవ్ నిర్వాహకులు తెలిపారు. మిగిలినవి అయోధ్యలోని ముఖ్య కూడళ్లు, ప్రదేశాల్లో ఉంచనున్నారు.

PM Narednar Modi: 23న అయోధ్యలో 15లక్షల మందితో దీపోత్సవ వేడుక.. పాల్గోనున్న ప్రధాని మోదీ..

ఇదిలాఉంటే సరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున కాల్చడంతో పాటు మ్యూజికల్ లేజర్ షోనూ నిర్వహించనున్నారు. రామ్‌లీలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. రష్యాతో పాటు ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శన ఇస్తాయి. అదేవిధంగా రామ్ కథా పార్క్‌లో రాముడు, సీతాదేవికి పట్టాభిషేకం జరిగే కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉంది.