Rescue Child : నీ గట్స్‌కి సెల్యూట్.. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన రైల్వేఉద్యోగి.. హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్‌లో..

మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి భారీ సాహసం చేశాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్ లో చిన్నారి ప్రాణాలు కాపాడాడు. తల్లితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. ఓవైపు వైగంగా ట్రైన్ వస్తోంది. అంతలోనే అక్కడున్న రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రెప్పపాటులో బాలుడిని కాపాడాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు పోయేవి. మహారాష్ట్రలోని వంగని స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

Rescue Child : నీ గట్స్‌కి సెల్యూట్.. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన రైల్వేఉద్యోగి.. హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్‌లో..

Railway Pointman Rescue Child

Railway Pointman Rescue Child : మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి భారీ సాహసం చేశాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్ లో చిన్నారి ప్రాణాలు కాపాడాడు. తల్లితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. ఓవైపు వైగంగా ట్రైన్ వస్తోంది. అంతలోనే అక్కడున్న రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రెప్పపాటులో బాలుడిని కాపాడాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు పోయేవి. మహారాష్ట్రలోని వంగని స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

ఒక్క సెకను ఆలస్యమైనా ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. ఆ రైల్వేమన్‌ బాలుడిని ఆపద్బాంధవుడిలా కాపాడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. వెంగని రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓ అంధురాలు, ఆమె వెంట బాలుడు నడుచుకుంటూ వెళుతున్నారు. అంతలోనే ఆ బాలుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అప్పటికే ఆ పట్టాలపై ఓ రైలు వేగంగా వస్తోంది. కంగారుపడిపోయిన ఆ మహిళ గట్టిగా అరుస్తూ బాలుడిని పైకి రావాలంటూ కోరుతోంది. ఇది గమనించిన మయూర్‌ షెల్కే అనే రైల్వే పాయింట్ మ్యాన్.. వెంటనే స్పందించాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.

పట్టాలపై నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా బాలుడిని ప్లాట్‌ఫామ్‌ ఎక్కించాడు. ఆ వెంటనే అతడు కూడా ప్లాట్‌ఫాం ఎక్కాడు. సెకను ఆలస్యమైనా ఆ బాలుడిని రైలు ఢీ కొట్టేదే. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మయూర్‌ షెల్కే అంటే గర్వంగా ఉందని ప్రశంసించారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ రైల్వే ఉద్యోగి సాహసాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. అతడి గట్స్ కి సెల్యూట్ చేస్తున్నారు.