Spy Pigeon: సాముద్ర తీరంలో గూఢచర్య పావురం .. కాళ్లకు కెమెరాలు, మైక్రో చిప్‌లు ..

ఒడిశాలోని సముద్ర తీరంలో గూఢచర్య పావురాన్ని గుర్తించారు. ఈ పావురం కాళ్లకు కెమెరా, మైక్రో చిప్‌లు కట్టి ఉన్నాయి. అయితే, ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికాలుకు ఈ పరికరాలను బిగించారు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Spy Pigeon: సాముద్ర తీరంలో గూఢచర్య పావురం .. కాళ్లకు కెమెరాలు, మైక్రో చిప్‌లు ..

Spy Pigeon In Odisha

Spy Pigeon: ఒడిశాలోని సముద్ర తీరంలో గూఢచర్య పావురాన్ని గుర్తించారు. ఈ పావురం కాళ్లకు కెమెరా, మైక్రో చిప్‌లు కట్టి ఉన్నాయి. అయితే, ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనికాలుకు ఈ పరికరాలను బిగించారు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ గూఢచర్య పావురాన్ని ఒడిశా రాష్ట్రం జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ సముద్ర తీరంలో మత్స్యకారులు తొలుత గుర్తించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వారి బోటులో పావురం కనిపించింది. పావురం బోటులోకి వచ్చి వాలడాన్ని గమనించిన మత్స్యకారులు దాని దగ్గరికి వెళ్లి చూడగా కాలుకు పలు పరికరాలు అమర్చి ఉన్నట్లు గుర్తించారు.

China Spy Balloon: సముద్రం నుంచి బయటకొచ్చాయి.. చైనా బెలూన్ శిథిలాల ఫొటోలను విడుదల చేసిన అమెరికా నౌకాదళం ..

పదిరోజుల క్రితం వీరు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు ఈ గాఢచర్య పావురం కనిపించింది. బోటులోని ఓ మత్స్యకారుడు నెమ్మదిగా పావురం దగ్గరకు వెళ్లి దానిని పట్టుకున్నట్లు బోటు యాజమాని బెహారా పోలీసులు తెలిపాడు. పావురాన్ని గుర్తించిన రోజున అప్పుడు పడవ కోణార్క్ తీరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం (మార్చి 8) వీరు సముద్ర తీరంకు వచ్చిన తరువాత  పోలీసులకు ఈ విషయాన్ని చెప్పి, పావురాన్ని అప్పగించారు. పావురం రెక్కలపైకూడా ఏదో రాసి ఉంది. ఇది ఒరియాలో కాకుండా వేరే భాషలో ఉందని మత్స్యకారుడు తెలిపారు.

China Spy Balloon: చైనా బెలూన్ కూల్చేసిన అమెరికా.. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన చైనా

జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. పావురం పాదాలకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పావురాన్ని వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. అయితే, పావురం రెక్కలపై రాసిఉన్న భాషను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణ పూర్తయితేగానీ, అసలు గూఢచర్య పావురం ఎక్కడి నుండి వచ్చింది?, దాని కాళ్లకు పరికరాలను ఎవరు అమర్చారు? అనే విషయాలపై స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.