Cyclone Jawad : తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. ఈ తుపానుకు జొవాద్‌గా నామకరణం చేశారు.

Cyclone Jawad : తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

Cyclone

deep depression turned cyclone : తుపాన్లు ఏపీని వదిలేలా లేవు. ఇప్పటికే తుపాన్‌ ప్రభావంతో రాయలసీమ అల్లకల్లోలం అయింది. ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే జొవాద్‌ రూపంలో మరో తుపాను ముంచు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అనంతరం పూరీ మీదుగా వెస్ట్‌బెంగాల్‌ వైపు జొవాద్‌ పయనించనుంది.

ప్రస్తుతం విశాఖకు 420 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్లు.. పారాదీప్‌కు 630 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. తీరం దాటకుండానే వెస్ట్‌బెంగాల్‌ వైపు తుపాను పయనించనుంది. తుపాను ప్రభావంతో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు తీరం వెంబడి గరిష్టంగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

YV Subbareddy : రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి : టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి

దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు సహాయకచర్యలపై ఫోకస్ పెట్టారు.

జొవాద్‌ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ప్రత్యేక సిబ్బందిని సిద్ధం చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. జిల్లాలోని ఏడు రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తిగా నీరు నిండింది. వర్షాలుకురిస్తే నీరు విడుదల చేసేందుకు వీలుగా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకేసారి కాకుండా.. క్రమపద్ధతిలో నీటి విడుదలకు చర్యలు చేపట్టింది.

Satyakumar : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది : బీజేపీ నేత సత్యకుమార్

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. రేపు, ఎల్లుండి పాఠశాలకు సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రెడీగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల కోసం నేవీ హెలికాప్టర్లను సిద్ధం చేసింది.