SSC Competitive Examinations : ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో ఎస్ఎస్ సీ పోటీ పరీక్షలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్ తోపాటు 13 భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

SSC Competitive Examinations : ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో ఎస్ఎస్ సీ పోటీ పరీక్షలు

SSC competitive examinations

SSC competitive examinations : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్ తోపాటు 13 భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు భాషల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. పోటీపరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని 2020 నవంబర్ 18న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే
నిర్వహించడం సరికాదన్నారు.

ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించి దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పదించింది. హిందీ, ఇంగ్లీష్ తోపాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో గ్రూప్-1, 2, 3 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది.

Central Government Jobs: కేంద్రంలో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. లోక్‌సభలో వెల్లడించిన ప్రభుత్వం

సాధారణంగా కేంద్రం గ్రూప్-బీ, గ్రూస్-సీ కేటగిరిల్లోని ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ (ఎస్ఎస్ సీ) ద్వారా భర్తీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు తక్కువగా సెలక్ట్ అవుతున్నారు. భాష కారణంగానే యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోకూడదనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2020 నవంబర్ 18న ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, డిఫెన్స్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర ఉద్యోగ నియామకాల కోసం  అన్ని పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే నిర్వహిస్తోంది. దీంతో ఇంగ్లీష్ మీడియం చదవని, హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఉద్యోగాల్లో సమానమైన, న్యాయమైన అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉంది.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

యూపీఎస్సీ, ఎస్ఎస్ సీ తదితర కమిషన్ లు నిర్వహించే పరీక్షలు తెలుగుతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి. అప్పుడే దేశంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం దక్కినట్లు అవుతుందని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్క మిషన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో
నిర్వహిస్తామని ప్రకటించింది.

దీనిని మల్టీ టాసింగ్ (నాన్ టెక్నిల్), (స్టాఫ్ పరీక్ష ఎమ్ టీఎస్) పరీక్షల్లో అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇకపై స్టాఫ్ సెలక్షన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ తోపాటు తెలుగు, ఊర్దూ, తమిళ్, మలయాళం, కన్నడ, అస్వామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా భాష అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.