9 పాయింట్లతో మోడీకి ప్రధాన విపక్ష పార్టీల లేఖ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో

9 పాయింట్లతో మోడీకి ప్రధాన విపక్ష పార్టీల లేఖ

Opposition Parties

Opposition Parties దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 12 ప్రధాన విపక్ష పార్టీలు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంయుక్త లేఖ రాశాయి. కరోనాని “ప్రపంచం ఎదుర్కొంటున్న మానవ విషాదం”గా పేర్కొన్న విపక్షాలు..ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను నిలిపివేయడం మరియు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం వంటి 9 అంశాలను ప్రధానికి సూచించాయి. బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ మినహా 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేఖపై సంతకం చేశాయి.

లేఖలో పేర్కొన్న 9 అంశాలు

అంతర్జాతీయంగా, దేశీయంగా అన్ని మార్గాల నుంచి వ్యాక్సిన్‌ను కేంద్ర సమీకరించాలి.
వెంటనే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ప్రారంభించాలి.
కంపల్సరీ లైసెన్సింగ్‌ను దేశీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి విస్తరించాలి.
వ్యాక్సిన్ల కోసం రూ. 35,000 కోట్లు వెంటనే కేటాయించాలి.
సెంట్రల్‌ విస్తా నిర్మాణం వెంటనే ఆపి.. ఆ మొత్తాన్ని ఆక్సిజన్‌, వ్యాక్సిన్లకు బదిలీ చేయాలి.
పీఎం కేర్‌లో ఉన్న మొత్తం నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు ఖర్చు చేయాలి.
నిరుద్యోగులకు నెలకు రూ. 6000 ఇవ్వాలి.
నిరుపేదలకు ఉచితంగా బియ్యం/గోధుమలు ఇవ్వాలి.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. వీటి రద్దు కోసం పోరాటం చేస్తున్న రైతులు కరోనా బారిన పడకుండా కాపాడాలి

తమ లేఖపై స్పందన కావాలని ప్రధానిని విపక్ష పార్టీలు కోరాయి. ఇవి మీ కార్యాలయం లేదా ప్రభుత్వం పాటించనప్పటికీ భారతదేశం మరియు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మేము ఇచ్చిన సలహాలకు ప్రతిస్పందనను మేము అభినందిస్తాము అని లేఖలో పేర్కొన్నారు.