80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్‌డీ

80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్‌డీ

ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్‌ 80 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి రిటైరైన శశికళా రావల్ 2009-11 మధ్య ఎంఏ (జ్యోతిష శాస్త్రం) చదివారు. అంతటితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలనే తపనతో సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి తన కోరిక నెరవేర్చుకున్నారు. వరాహమిహిరుడి ‘బృహత్‌ సంహిత‘పై సంస్కృతంలో పీహెచ్‌డీ చేయాలని సంకల్పించారు.

2019లో పీహెచ్‌డీని పూర్తి చేశారు. యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ చేతులమీదుగా శశికళ పీహెచ్‌డీ అందుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం అంటే ఎంతో ఇష్టపడే శశికళా రావల్ దాంట్లో నిష్ణాతురాలిగా పేరు పొందారు. ఈ శాస్త్రంలో సవాళ్లను ఎదుర్కోవటానికి ఈ పీహెడ్ డీ ఎంతో ఉపయోపడుతుందని ఆమె తెలిపారు. జీవితంలో సవాళ్ల రకాలను ముందుగానే అంచనా వేస్తే.. జీవితాన్ని నావిగేట్ చేయడం చాలా సులభం అని ఆమె అన్నారు. తన జ్ఞానాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.