5 States Elections : మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్

మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ వేసారు.మణిపూర్ సంప్రదాయ నృత్యంతో చిందేశారు.

5 States Elections : మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్

Minister Smriti Irani Performing Manipur Traditional Dance

Minister Smriti Irani performing Manipur traditional dance : ఎన్నికలు వచ్చాయంటూ చాలు నాయకులకు ప్రజలు..వారి కష్టాలు, వారి సంప్రదాయాలు అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఎన్నికల ప్రచారాలు చేస్తు నాయకులు రోడ్డు పక్క బండిమీద దోసెలు వేస్తారు.ఇలా ఎన్నో చేస్తుంటారు. ఎన్నికల సిత్రాలు ఎన్నని చెప్పాలి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.దీంట్లో భాగంగానే మణిపూర్ లో కూడాఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, ఎస్పీ పార్టీలు పనిచేస్తున్నాయి. నాయకులు ప్రజల్ని ఆకట్టుకునే పని చేస్తున్నారు. అక్కడి ఆయా రాష్ట్రాల కల్చర్ కి అనుగుణంగా ప్రజల్లో కలిసిపోయేందుకు ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న క్రమంలో మణిపూర్ సంప్రదాయ నృత్యంచేశారు స్థానిక మహిళలతో కలిసి..

Also read : Manipur Election : బీజేపీ తొలి‘మణి’పూస..కౌన్సిలర్‌ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి..అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా?

మణిపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న స్మృతి ఇరానీ అక్కడి ప్రజలతో సంప్రదాయ నృత్యం చేశారు. ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్‌ఖీ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. కళాకారులకు అనుగుణంగా స్పెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ఇలాగే స్టెప్పులేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రజలతో కలిసి చిందేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి.. కూడా కిరణ్ రిజిజు డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

కాగా..మణిపూర్ లో అధికారం కోసం బీజేపీ శ్రమిస్తోంది. ఇప్పటికే మణిపూర్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓ మహిళకు ఇచ్చిన బీజేపీ మహిళా ఓటర్లను ఆకట్టుకుంటోంది. మణిపూర్ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన శారదాదేవి తీవ్రంగా బీజేపీని అధికారంలోకి తేవటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also read : Manipur : ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌‌కు స్కూటర్లు, ల్యాప్ టాప్‌‌లు.. బీజేపీ మేనిఫెస్టో

కౌన్సిలర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎదిగిన శారదాదేవి తమ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్ని తానై..అన్నింటా తానై గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓ మహిళకు బీజేపీ పగ్గాలు దక్కటం..పైగా ఈ ఎన్నికల్లో కొంతమంది మహిళలకు శారదాదేవి పట్టు పట్ట మరీ టిక్కెట్లు ఇప్పించటంతో స్వంత పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. వీటిన్నింటి అధిగమించి శారదాదేవి కమలం కోసం శ్రమిస్తున్నారు. మరి మణిపూర్ ను బీజేపీ గెలుచుకుంటుందో లేదో వేచిచూడాలి.