Bharat BioTech: ఐక్యరాజ్యసమితి ద్వారా కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది.

Bharat BioTech: ఐక్యరాజ్యసమితి ద్వారా కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Covaxin

Bharat BioTech: కరోనా నివారణకు ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్ వ్యాక్సిన్” సరఫరాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరోసారి మోకాలడ్డేట్టింది. ఐక్యరాజ్యసమితి ద్వారా వివిధ దేశాలకు సరఫరా చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు WHO ప్రకటించింది. ఈమేరకు శనివారం పలు సూచనలతో కూడిన ప్రకటనను WHO విడుదల చేసింది. వ్యాక్సిన్ రవాణాకు అవసరమైన సౌకర్యాలను తయారీదారు మరింత మెరుగుపర్చుకోవాలని మరియు ఇటీవల తనిఖీలలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. వ్యాక్సిన్ అందుకున్న దేశాలు సైతం ఆయా టీకాలను నిల్వ విషయంలో జాగ్రత్తలు పాటించాలని WHO సూచించింది.

Also read:Autism : చిన్నారులకు ఆటిజం ముప్పు! తల్లిదండ్రులు సకాలంలో స్పందిస్తే!

అయితే లోపాలు ఏంటి..వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే మార్గదర్శకాలను మాత్రం WHO పొందుపరచలేదు. ఇదిలాఉంటే..కొవాగ్జిన్ టీకా ప్రభావంలో ఎటువంటి లోపంలేదని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితంగానే ఉన్నట్లు WHO పేర్కొంది. కేవలం టీకా సరఫరా, నిల్వ సంబంధిత మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాలని మాత్రమే WHO సూచించింది. దీంతో ఆ సౌకర్యాలను మెరుగుపరుచుకునే వరకు విదేశాలకు ఎగుమతి నిలిపివేయాలన్న ఆదేశాలతో టీకా తయారీపై కొంత ప్రభావం పడనుంది.

Also Read:Pak Election : పాక్‌‌లో త్వరలో ఎన్నికలు ?.. సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్

కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ నిమిత్తం WHO ప్రతిపాదించిన అనంతరం మార్చి 14-22 మధ్య జరిపిన ప్రయోగ ఫలితాలను విశ్లేషించిన అనంతరం..కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేయాలని భారత్ బయోటెక్ కు సూచించింది WHO. ఈక్రమంలో ఏప్రిల్ 1 నుంచే టీకా ఉత్పత్తిని కాస్త తగ్గించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రజల్లో వైరస్ వ్యాప్తి తగ్గి రోగనిరోధకత పెరుగుతుండడంతో టీకా డిమాండ్ తగ్గినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

Also read:new Covid cases : దేశంలో 24గంటల్లో 1,096 కొవిడ్ కొత్త కేసులు.. 81 మంది మృతి