చంద్రబాబు బాస్ట.. అన్నారు, లోకేష్ గొంతు పట్టుకున్నారు : సీఎం జగన్

మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 05:09 AM IST
చంద్రబాబు బాస్ట.. అన్నారు, లోకేష్ గొంతు పట్టుకున్నారు : సీఎం జగన్

మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా

మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. నిన్నటి ఘర్షణ తాలుకూ వీడియోలను సభలో ప్రదర్శించింది. అసలేం జరిగిందో అందరికీ తెలియాలి అంటూ వీడియోలను చూపింది. ఎవరు ఎవరిపై దౌర్జన్యం చేశారో ప్రజలకు తెలుస్తుంది అంటూ ఘర్షణకు సంబంధించిన వీడియోలను అసెంబ్లీలో ప్రదర్శించారు.

గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలకు, మార్షల్స్ కు మధ్య ఘర్షణ జరిగింది. అసెంబ్లీలోకి రాకుండా తమను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. టీడీపీ నేతలే దౌర్జన్యం చేశారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. మార్షల్స్ వారి విధులు వారు నిర్వర్తించారని వివరించింది. నిబంధనల ప్రకారం.. అసలు ఆ గేటు ద్వారా ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలోకి రాకూడదని ప్రభుత్వం చెప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రూల్స్ బ్రేక్ చేశారని, ఎమ్మెల్యేలు కాని వారిని కూడా అసెంబ్లీ లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఈ క్రమంలోనే మార్షల్స్ వారిని అడ్డుకోవటం జరిగిందన్నారు. ఇందులో మార్షల్స్ తప్పేమీ లేదన్నారు. తప్పంతా టీడీపీ నేతలదే అని ప్రభుత్వం తెలిపింది. తప్పు చేయడమే కాకుండా అసెంబ్లీ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు.

చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెప్పడానికి ఈ వీడియోలు నిదర్శనం అని సీఎం జగన్ అన్నారు. గేట్ నెంబర్ 2 నుంచి చంద్రబాబు ప్రవేశించాలి, కానీ రూల్స్ కు విరుద్ధంగా మరో గేటు నుంచి అసెంబ్లీలోకి రావాలని చూశారని, అందుకే మార్షల్స్ వారిని అడ్డుకున్నారని సీఎం వివరించారు. చంద్రబాబు.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బాస్టర్డ్ అన్నారు, అది దారుణమైన తిట్టు అని జగన్ అన్నారు. లోకేష్.. నాలుగు అడుగులు ముందుకేసి ఓ అసెంబ్లీ ఉద్యోగి గొంతు పట్టుకున్నారని చెప్పారు.

ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక గేటు నుంచి రాకుండా చంద్రబాబు ఊరేగింపుగా వచ్చారని, ఎమ్మెల్యేలు కాని వారిని కూడా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. ఎవరు ఎమ్మెల్యేలో ఎవరు కాదో తెలియకనే మార్షల్స్ వారిని అడ్డుకున్నారని సీఎం తెలిపారు. టీడీపీ నేతలు తప్పు చేయడమే కాకుండా అడ్డుకున్న మార్షల్స్ ను ఇష్టారీతిన దుర్భాషలాడారని, దాడికి పాల్పడ్డారని సీఎం జగన్ చెప్పారు. నిన్న చంద్రబాబు చాలా అమానుషంగా ప్రవర్తించారని సీరియస్ అయ్యారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది దారుణమైన ఘటన అన్నారు.