Mayawati: అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. రాహుల్ అనర్హతపై భిన్నరీతిలో స్పందించిన మాయావతి

నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు

Mayawati: అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. రాహుల్ అనర్హతపై భిన్నరీతిలో స్పందించిన మాయావతి

Mayawati defferent reaction on rahul's disqualification

Mayawati: అధికార పక్షమేమో రాహుల్ గాంధీపై అనర్హతను పూర్తి స్థాయిలో సమర్ధిస్తుండగా, విపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దగా గిట్టని రాజకీయ పక్షాలు సైతం రాహుల్ మీద తీసుకున్న చర్యల్ని తప్పు పట్టాయి. అయితే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఇందుకు భిన్నంగా స్పందించారు. స్వార్థ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారేనని, ప్రజా ప్రయోజనాల కోసం పని చేయకుండా స్వలాభ రాజకీయాలు చేయడంలో ఎవరినీ తక్కువ చేయొద్దంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

Wayanad: రాహుల్ గాంధీ కోల్పోయిన వయనాడ్ నియోజకవర్గంలో తొందరలో ఎన్నిక?

శనివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘మొదట కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం.. ప్రతి స్థాయిలోనూ, ప్రతి సందర్భంలోనూ తీవ్ర స్వార్థ రాజకీయాలలే. వారి రాజకీయాల కారణంగా పేదరికం తీవ్ర స్థాయికి పెరిగింది. సమగ్ర ప్రజా ప్రయోజనం, ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాలపై ఏ పార్టీ పూర్తి శ్రద్ధ చూపడం లేదు. నిరుద్యోగం, వెనుకబాటుతనం మొదలైనవి చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా విచారకరం, దురదృష్టకరం.

Amritpal Singh: మరో కొత్త వేషంలో అమృత్‌పాల్ సింగ్.. సీసీ టీవీ ఫుటేజ్ లభ్యం

నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. భవిష్యత్తులో కూడా జరగబోవు. అందువల్ల, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, గత 75 సంవత్సరాలలో పాలన చేసిన ప్రభుత్వాలు రాజ్యాంగ పవిత్ర ఉద్దేశ్యాలను పరిగణలోకి తీసుకుని, ప్రజాస్వామ్య నియమాలు పాటించి, సంప్రదాయాల ప్రకారం నిజాయితీగా, చిత్తశుద్ధితో పని చేసి ఉంటే మహనీయులు కలలుగన్న భారతదేశం ఏర్పడి ఉండేది. మానవతావాద అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలచేది’’ అని వరుస ట్వీట్లు చేశారు.

Tamilnadu: అలా జరిగితే రాజీనామా చేస్తానని, అంతలోనే మాట మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

చాలా సందర్భాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మీద మాయావతి విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలను నాగు పాటు, తాచు పాము అంటూ పోలికలు కూడా పెట్టారు. రెండు పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని అనేక సందర్భాల్లో అన్నారు.