BJP vs Congress: పార్లమెంట్ భవనంపై రచ్చ లేపి, అసెంబ్లీ భవవం వద్ద అడ్డంగా ఇరుక్కున్న కాంగ్రెస్

ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్‭పూర్ (ఛత్తీస్‌గఢ్‌ రాజధాని)‭కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది

BJP vs Congress: పార్లమెంట్ భవనంపై రచ్చ లేపి, అసెంబ్లీ భవవం వద్ద అడ్డంగా ఇరుక్కున్న కాంగ్రెస్

Parliament Inauguration Controversy: భారత నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రపతిని పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోత్సవం చేయడమేంటని ఒంటికాలిపై లేస్తోంది. అంతే కాదు, రాజ్యాంగం ప్రకారం.. అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతిని వదిలేసి ప్రధాని ప్రారంభోత్సవం చేస్తుండడాన్ని నిరసిస్తూ ఇప్పటికే బాయ్‭కాట్ చేసింది కూడా. నిజానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ హంగామాకు అధికార భారతీయ జనతా పార్టీ సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది. అయితే ఒక్కసారి ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ నూతన భవనంతో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఇరుక్కుపోయింది.

TDP Mahanadu 2023: ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం.. బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

దీంతో ఈ వివాదం ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్‭పూర్ (ఛత్తీస్‌గఢ్‌ రాజధాని)‭కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్వయంగా రాహుల్, సోనియాలను ఆహ్వానించి ఈ కర్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై లేస్తున్న ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా ఇరకాటంలోకి నెట్టేశాయి.

Narendra Modi: తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఏయే ముఖ్య పథకాలు ప్రవేశపెట్టారో తెలుసా?

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీని సోనియా గాంధీ ప్రారంభించిన నిజమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో అన్నారు. ఇలాంటివి జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేకం జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇదే వ్యక్తులు ఇప్పుడు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో మీరేం చేశారని కాంగ్రెస్‌ని అడుగుతున్నాను. ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఎందుకు పిలవలేదు? అసెంబ్లీ భవనానికి భూమి పూజి చేసేందుకు సోనియా, రాహుల్ ఎవరు?’’ అని అమిత్ షా ఘాటుగానే స్పందించారు.

Kamal Haasan: పార్లమెంట్ నూతన భవన వివాదంపై విపక్షాలకు కమల్ హాసన్ ఆసక్తికర సలహా

ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్ అయిన అనుసూయ ఉయికేను భూమిపూజలకు పిలవలేదు. పైగా గవర్నర్ ఉయికే సైతం గిరిజన మహిళ కావడం మరో విశేషం. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ద్రౌపది ముర్మును గిరిజన మహిళగా చూపిస్తూ విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌ విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి సంబంధించి బీజేపీ లేవనెత్తుతున్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం కూడా వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ శంకుస్థాపన, గవర్నర్‌ను పార్టీ నిబద్ధతతో ముడిపెట్టి మోదీ ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు రమణ్‌సింగ్ ప్రయత్నిస్తున్నారని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి సుశీల్ ఆనంద్ శుక్లా అన్నారు.