Karnataka lessons: కర్ణాటక కాంగ్రెస్ పాఠాలు రాజస్థాన్ కాంగ్రెస్‭కు అత్యవసరం.. ఎందుకో తెలుసా?

రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు

Karnataka lessons: కర్ణాటక కాంగ్రెస్ పాఠాలు రాజస్థాన్ కాంగ్రెస్‭కు అత్యవసరం.. ఎందుకో తెలుసా?

Rajasthan Congress: కర్ణాటక ఎన్నికల అనంతరం.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేర్చుకున్న పాఠాలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం అని అంటున్నారు. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీనే. ఇరు రాష్ట్రాల్లో కొద్ది రోజుల తేడాతో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Telangana Congress: కర్ణాటక గాలి తెలంగాణకు వీచేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా?

అయితే కర్ణాటక కాంగ్గెస్ పార్టీలో ఒక తేడా ఉంది. నాయకుల మధ్య వైరం ఉన్నప్పటికీ.. పార్టీ విధానాల్లో మాత్రం వారు కలిసే పని చేశారు. వారి మధ్య ఉన్న బేదాభిప్రాయాలను అంతర్గతంగానే చూసుకున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ద్వయం కలిసి పార్టీని ఎన్నికల్లో గెలిపించారు. కానీ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అలా లేదు. అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీయే అవినీతి ఆరోపణలు చేయడం, పోరాటాలు చేయడం గమనార్హం.

Karnataka: అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.. కానీ అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది?

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గానే ఉంది. వాస్తవానికి రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐక్యత గెలుపు ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. అలాగే రాజస్థాన్‭లో వర్గ పోరు పార్టీని దెబ్బతీయొచ్చని కూడా అంటున్నారు. అందుకే కర్ణాటక ఫార్ములాను కనుక రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు పాటిస్తే మరికొద్ది రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.