Sourav Ganguly, MS Dhoni: సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కలయిక.. ఫొటోలు వైరల్
Sourav Ganguly MS Dhoni Meet: భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కలయిక క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

Sourav Ganguly, MS Dhoni Meet: భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కలయిక క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ ఇటీవల ముంబైలో కలుసుకున్నారు. దిగ్గజ కెప్టెన్ల ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ సుదీర్ఘ సంభాషణలో ఉన్నట్లు ఫొటోల్లో కనబడుతున్నారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో గంగూలీ, ధోని ఫొటోలను షేర్ చేసింది. ప్రిన్స్ సూపర్ కింగ్‌ను కలుసుకున్నప్పుడు! అని క్యాప్షన్ జోడించింది. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని నాయకత్వం వహించనున్నాడు. బహుశా ఇదే అతడికి ఆఖరి సీజన్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. గత సీజన్ లో సీఎస్ కే కెప్టెన్ గా వ్యవహరించిన రవీంద్ర జడేజా రాణించకపోవడంతో టోర్ని మధ్యలోనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
When the Prince met the Super King! ?#WhistlePodu #Yellove ??@SGanguly99 @msdhoni pic.twitter.com/Mii4xjzlbp
— Chennai Super Kings (@ChennaiIPL) February 3, 2023
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ, ఎంఎస్ ధోని అత్యుత్తమ కెప్టెన్లుగా ప్రఖ్యాతిగాంచారు. గంగూలీ కెప్టెన్సీలో ధోని అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి క్రికెట్ డైరెక్టర్‌గా గంగూలీ వ్యవహరించనున్నాడు. మూడేళ్లపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. గంగూలీ తర్వాత బీసీసీఐ చైర్మన్ గా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టారు.
View this post on Instagram
Read Also : Suryakumar Yadav Fans: కాస్తైనా సిగ్గుపడు.. బాబర్ ఆజంపై సూర్య భాయ్ ఫ్యాన్స్ ఫైర్