IND vs NZ 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. నేడు కివీస్‌తో చివరి వన్డే .. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ..

స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్‌లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్‌లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది.

IND vs NZ 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. నేడు కివీస్‌తో చివరి వన్డే .. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ..

IND vs NZ 3rd ODI

IND vs NZ 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న భారత్ జట్టు.. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుపైకూడా వరుసగా రెండు మ్యాచ్ లు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ విజయం సాధించి ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.

India vs New zealand ODI Series: ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ రెండో వ‌న్డే.. ఫొటో గ్యాల‌రీ

భారత్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. యువ ఆటగాళ్లుసైతం వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్యాటింగ్ పరంగా భారత్ జట్టు బలంగా ఉంది. రెండో వన్డేలో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బౌలింగ్ విభాగంలోనూ భారత్ జట్టు బలంగానే ఉందని చెప్పొచ్చు. మరోవైపు మూడో వన్డేలో మెరుగైన ప్రదర్శనతో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తుంది. మొదటి వన్డేలో భారత్‌కు చివరి వరకు చెమటలు పట్టించిన న్యూజిలాండ్ జట్టు.. రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ భారత్ బౌలర్ల దాటికి పేకమేడలా కూలిపోతుంది. మూడో వన్డేలో అలా జరగకుండా జాగ్రత్త పడటం ద్వారా టీమిండియాకు ఓడించాలని కివీస్ జట్టు సన్నద్ధమవుతోంది.

India vs New Zealand: భారత్ బౌలర్ల విజృంభణ.. అతితక్కు‌వ స్కోర్‌కే కుప్పకూలిన కివీస్ టాప్ ఆర్డర్

రెండు వన్డే మ్యాచ్ లను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు.. మూడో వన్డేలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రెండు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్, షమీలలో ఎవరికైనా ఒకరికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చే యోచనలో కెప్టెన్ రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్విన్నర్ చాహల్ నుసైతం తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక ఇండోర్ స్టేడియం బ్యాటింగ్ కు పూర్తి అనుకూలం కావటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.