Covid 19 : 7లక్షల మందిపై కేసులు, రూ.35కోట్ల జరిమానా.. లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘనలపై చర్యలు

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. ఉల్లంఘనులపై కేసులు పెడుతున్నారు, వాహనాలు సీజ్ చేస్తున్నారు. అంతేకాదు జరిమానాలూ విధిస్తున్నారు.

Covid 19 : 7లక్షల మందిపై కేసులు, రూ.35కోట్ల జరిమానా.. లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘనలపై చర్యలు

Covid 19 Norms Violation Cases

Covid 19 Norms Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. ఉల్లంఘనులపై కేసులు పెడుతున్నారు, వాహనాలు సీజ్ చేస్తున్నారు. అంతేకాదు జరిమానాలూ విధిస్తున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై నమోదు చేసిన కేసులకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకి నివేదిక సమర్పించారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదయ్యాయని డీజీపీ తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4లక్షల 18వేల కేసులు నమోదు చేసి, రూ.35.81 కోట్ల జరిమానా విధించామన్నారు. భౌతికదూరం పాటించనందుకు 41వేల 872 కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడినందుకు 13వేల 867 కేసులు పెట్టామన్నారు. అలాగే మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై 150 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ చెప్పారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో డీజీపీ వివరించారు.