Man Murdered In Medak : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన పెట్రోల్ బాటిల్

మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.

Man Murdered In Medak : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన పెట్రోల్ బాటిల్

MURDER

Man Murdered In Medak : డబ్బుల కోసం అడ్డదారి తొక్కాడో వ్యక్తి.. ఏలాగైనా డబ్బులు కావాలి… ఆ డబ్బులతో అప్పులతో తీర్చాలనుకున్నాడు. డబ్బుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం రకరకాల మార్గాలను అన్వేషించాడు. కానీ చివరకు పెద్ద డ్రామా వేశాడు. తనను తాన చనిపోయినట్లు చిత్రీకరించాలకున్నాడు. ఇందుకోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఎంత పక్కాగా ప్లాన్ వేసినప్పటికీ చివరికి పోలీసులకు చిక్కాడు. ఆ నిందితుడిని పెట్రోల్ బాటిల్ పట్టించింది. ఈ ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిలే పోలీసులుకు కీలక ఆధారంగా మారింది.

కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ డ్రామా నడిపింది ఎవరో కరడుకట్టిన నేరగాడు కాదు.. సచివాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తి.. అతని పేరే ధర్మనాయక్. ఇప్పుడు చేసిన మర్డర్ డ్రామా బయటపడటంతో ధర్మానాయక్ కాస్తా డ్రామా నాయక్ గా మారాడు. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్.

hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు

ధర్మానాయక్ సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. రకరకలా వ్యసనాలకు బానిసైన ధర్మానాయక్  విపరీతంగా అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ధర్మానాయక్ కు ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి అతను పెద్ద డ్రామా వేశాడు. ధర్మానాయక్ కు ఏడు కోట్ల ఇన్సూరెన్స్ ఉంది.. తాను చనిపోతే ఆ డబ్బులు వస్తాయని ధర్మానాయక్ సినిమాలోని క్రైమ్ సీన్ ను తలపించేలా డ్రామా ఆడాడు. తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.

డ్రైవింగ్ సరిగ్గా రాకున్నా నెల రోజుల క్రితం ఒక సెకండ్ హ్యాండ్ కారును తీసుకున్నారు. అనంతరం ధర్మానాయక్ తన అల్లుడితో కలిసి స్కెచ్ వేశాడు. ఈ నెల 8న బీహార్ కు హైదరాబాద్ లో రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి అద్దెకు మాట్లాడుకున్నాడు. డ్రైవర్ ను తీసుకుని ధర్మానాయక్ అతని అల్లుడు బాసర వెళ్లారు. కారులోనే ధర్మానాయక్ చనిపోయినట్లు చిత్రీకరించాలని ధర్మానాయక్, అతని అల్లుడు ప్లాన్ చేశారు. మెదక్ లో డ్రైవర్ ను కారులోని సజీవ దహనం చేశారు. డ్రైవర్ లేకుండా ఆనవాళ్లు లేకుండా కారులోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.

Chennai : డబ్బుల కోసం కరోనా రోగిని హత్య చేసిన ఉద్యోగిని

ముందుగా అందరూ ధర్మానాయక్ చనిపోయారని అనుకున్నారు కానీ చనిపోయింది ధర్మానాయక్ కాదని తెలిసి షాక్ అయ్యారు. ఈ నెల 9న జరిగిన సజీవ దహనం ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో వెంకటాపురం వాసులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు పెట్రోల్ బాటిల్ దొరికింది. కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు పెట్రోల్ బాటిల్ ను కీలక ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దాదాపు నెల రోజులకు పైగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఎట్టకేలకు నిందితుడు చిక్కాడు.  నిందితుడిని విచారిస్తున్నారు. డ్రైవర్ ను హత్య చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లిన ధర్మా నాయక్ తన ధర్మానాయక్ విషయం చెప్పి పారిపోయినట్లు సమాచారం. ధర్మానాయక్ బతికే ఉన్నాడని మెదక్ ఎస్పీ ప్రియదర్శిని తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అల్లుడితో కలిసి ధర్మా ఇదంతా ప్లాన్ చేశాడని చెప్పారు.