CM KCR  : తెలంగాణలో ప్రతి గ్రామానికి ఓ దవాఖాన – సీఎం కేసీఆర్

రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

CM KCR  : తెలంగాణలో ప్రతి గ్రామానికి ఓ దవాఖాన – సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR  : రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్బంగా గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే దవాఖానలు వస్తాయని తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతాయని, ఆస్పత్రుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఇక నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ నగరంలో 350 బస్తి దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని ఒక్క డివిజన్ లో 2 నుంచి 3 బస్తి దవాఖానల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Read More :  Hetero Pharma : హెటిరో ఫార్మా కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ఆరోగ్య సదుపాయాలు పెంచాలనే ఉద్దేశంతో పల్లెల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీస్తున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. కరోనా, స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. 12,769 గ్రామాలకు పంచాయతీ సెక్రటరీలను నియమించామని టాప్ టు బాటమ్ అన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చామని వివరించారు. మహిళలకు ప్రసూతి సెలవులు ఇచ్చినప్పుడు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని కేసీఆర్ వివరించారు. ప్రసూతి సెలవుపై వెళ్లిన వారి స్థానంలో 980 మంది పని చేస్తున్నారని సీఎం వివరించారు. ఎక్కడా ఖాళీ ఏర్పడ్డ వారం రోజుల్లోనే నియమిస్తున్నారు. ఇదంతా అభివృద్ధి కోసమే అన్ని అన్నారు. నిధులు విడుదల కూడా అలాగే చేస్తున్నాం అని పేర్కొన్నారు.

Read More : Haryana : రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు..ఒకరికి గాయాలు

ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శించారు గుప్పించారు సీఎం.. గతంలో మంచినీళ్ల కోసం గోస ఉండేది. మహిళలు నీటి కోసం బిందెలు పట్టుకొని ఎదురుచూస్తేవారు. ఇప్పుడు రాష్ట్రంలో బిందెల ప్రదర్శన లేదని తెలిపారు. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథను చూసి నీతిఆయోగ్ ప్రశంసించింది. రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. అవార్డులు మాత్రం మోయలేనన్ని వచ్చాయి. మిషన్ భగీరథ పుణ్యమా అని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ విజయం సాధించింది. ఈ విషయాన్నే కేంద్రం అధికారికంగా ప్రకటించింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.