Telangana Budget 2021-22 : రైతుబంధుకు రూ.14వేల కోట్లు, రుణమాఫీకి రూ.5వేల కోట్లు.. రైతులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి వ్యవసాయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతుబంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు.

Telangana Budget 2021-22 : రైతుబంధుకు రూ.14వేల కోట్లు, రుణమాఫీకి రూ.5వేల కోట్లు.. రైతులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

Telangana Budget Farmers

cm kcr good news for farmers : 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం(మార్చి 18,2021) ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల అంచనాతో బడ్జెట్ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు.

ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా రూపొందించబడిందని మంత్రి అన్నారు. గతేడాదిని కరోనా ఆర్థికంగా దెబ్బతీసిందని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వార్షిక బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు వివరించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం మరోసారి వ్యవసాయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతుబంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు.

”ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతి పథంలో అధిగమించింది. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపధాన పయనిస్తున్నాం. గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’’ అని హరీష్ రావు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు.

బడ్జెట్‌ హైలైట్స్..
• ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు.
• మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు.
• పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు.
• రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు.
• పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు.
• సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు.
•వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
• రైతుబంధు- రూ.14,800 కోట్లు.
• రుణమాఫీ- రూ.5,225 కోట్లు.
•వ్యవసాయశాఖ – రూ.25వేల కోట్లు
• పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు.
• నీటిపారుదలశాఖ- రూ.16,931 కోట్లు.
• సమగ్ర భూ సర్వే- రూ.400 కోట్లు.

• ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు.
• కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ రూ.2,750 కోట్లు.
• ఎస్సీల ప్రత్యేక ప్రగతి కోసం రూ.12,304 కోట్లు.
• ఎస్టీల ప్రత్యేక ప్రగతి కి రూ.12,304 కోట్లు.
• నేతన్నల సంక్షేమం కోసం రూ.338 కోట్లు.
• బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు.
• పాఠశాల విద్యకు రూ.11,735 కోట్లు.
• ఉన్నత విద్యకు రూ.1,873 కోట్లు.
• మూసీ నది అభివృద్ధికి రూ.200 కోట్లు.
• మెట్రో రైలుకు రూ.1000 కోట్లు.
• ఓఆర్‌ఆర్‌ వెలుపల నీటి సరఫరాకు రూ.250 కోట్లు.
• ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150 కోట్లు.
• ఆర్టీసీకి రూ.15 00 కోట్లు.
• అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.
• పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు.
• నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు.
• రీజినల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.
• ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృధ్ధి నిధుల కోసం రూ.800 కోట్లు.
• డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం రూ.11వేల కోట్లు.