CM KCR: త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ..? నెలాఖరులో ఢిల్లీలో ప్రకటించే ఛాన్స్..

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ  క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నూతన పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అని పేరును సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ జెండాకు గులాబీ కలర్ జెండాలో భారత దేశ పటం ఉండేలా చూడాలని భావిస్తున్నారట. అయితే ఈ నెలాఖరు లోగా కొత్త పార్టీ పేరును, పార్టీ ఏర్పాటుకు కారణాలు, భవిష్యత్ కార్యాచరణను సైతం సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

CM KCR: త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ..? నెలాఖరులో ఢిల్లీలో ప్రకటించే ఛాన్స్..

CM KCR: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ  క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నూతన పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అని పేరును సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ జెండాకు గులాబీ కలర్ జెండాలో భారత దేశ పటం ఉండేలా చూడాలని భావిస్తున్నారట. అయితే ఈ నెలాఖరు లోగా కొత్త పార్టీ పేరును, పార్టీ ఏర్పాటుకు కారణాలు, భవిష్యత్ కార్యాచరణను సైతం సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.

Minister KTR: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరు గంటలపాటు సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలు విషయాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ఏర్పాటుపై కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు, దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు, ఈ నెల 19న జరిగే తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వచ్చే నెలలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని, బీజేపీ కి ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటు అవసరమని, అందుకే కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు కేసీఆర్ సమావేశంలో నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే తెలంగాణ మోడల్ లో పథకాలు ఉండాలని, అందుకే కొత్త పార్టీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కేసీఆర్ అన్నట్లు సమాచారం.

Minister KTR : రాహుల్, బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉంటే రాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశంలో అన్ని పార్టీలు తమతమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేఫథ్యంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నప్రతిపక్ష పార్టీల అభ్యర్థికి మద్దతు ఇద్దామా, లేకుంటే కొత్త అభ్యర్థిని బరిలో నిలిపి దేశంలోని బీజేపీ, కాంగ్రేసేతర పార్టీల మద్దతు కూడగడదామా అనే అంశాలపై కేసీఆర్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం.