కొత్త వేరియంట్స్‌తో హడలెత్తిస్తోన్న కరోనా..బయటికి వెళితే మాస్క్‌, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి

అటెన్షన్ ప్లీజ్‌... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్‌డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.

కొత్త వేరియంట్స్‌తో హడలెత్తిస్తోన్న కరోనా..బయటికి వెళితే మాస్క్‌, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి

Corona new variants : అటెన్షన్ ప్లీజ్‌… కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్‌డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు. కేసులు మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇంతకీ వాళ్లు అలా అనడానికి కారణాలేంటి?

గతేడాది ఇదే సమయంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించింది. దాన్ని చూసి మొదట బయపడ్డాం.. ఆ తర్వాత జాగ్రత్తపడ్డాం. మహమ్మారి విసిరిన పంజా ముందు.. ఎంతో మంది ప్రాణాలు విడిచారు. మరెంతో మంది ఆర్ధికంగా కూలిపోయారు. కొన్ని సంస్థలైతే కరోనా దెబ్బకు కుదేలైపోయాయి. ఇప్పుడు కోవిడ్-19 కొంచెం శాంతించింది. వ్యాక్సిన్ కూడా రావడంతో ప్రజలు కొంచెం రిలాక్స్‌ అవుతున్నారు.

ప్రజలు రిలాక్స్‌ అయినట్టుగా వైరస్ రిలాక్స్‌ కాలేదు. రంగులు మార్చుకుంటూ కొత్తకొత్తగా మళ్లీ కమ్మేసేందుకు వచ్చేస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకూ మూడు లక్షల 153 కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్‌లోనే 54శాతం వరకూ కరోనా వచ్చిపోయిందని ప్రకటించింది సీసీఎంబీ. దీంతో రాష్ట్రంలో కేసులు తెలియకుండా ఎన్ని ఉన్నాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాక్సిన్‌ వచ్చేసింది.. హర్డ్ ఇమ్యునిటీ డెవలప్‌ అయ్యింది.. అనే కారణాలతో కరోనాను లైట్ తీసుకుంటున్నారు జనం. ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్‌ కానీ, మాస్కుల వాడకం కానీ లేదు. చావులు, పెళ్లిళ్లు, ఫంక్షన్‌లు, పార్టీల మీటింగ్‌ పేరుతో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం అంటున్నారు గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్ రాజారావు. కరోనా కేసులు పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నోరకాలుగా మ్యూటేషన్ అవుతోంది. కేసులు విపరీతంగా పెరిగి లాక్‌డౌన్ వంటి పరిస్థితులు రాకూడదంటే.. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడకతప్పదు. బయటికెళ్లాలంటే మస్క్‌, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.!