Eatala Rajender : రేపు ఉ.11గంటలకు MLAగా ఈటల రాజేందర్ ప్రమాణం

గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు.

Eatala Rajender : రేపు ఉ.11గంటలకు MLAగా ఈటల రాజేందర్ ప్రమాణం

Eatala Rajender

Eatala Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు (నవంబర్ 10, బుధవారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ.. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం.

Read This : Etela Rajender : ఈటల రాజేందర్ ఘన విజయం.. హిస్టరీ రిపీట్స్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది. బీజేపీ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఈటల రాక, ఈటల ప్రసంగం, ఆయన విమర్శలు.. ప్రభుత్వం వివరణలు.. ఇవన్నీ టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కానున్నాయి.

రేపటి ఈటల ప్రమాణస్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Read This : Etela Rajender : మొదటిసారి రాష్ట్ర బీజేపీ ఆఫీసుకు ఈటల… సన్మానానికి భారీ ఏర్పాట్లు!