Family Suicide In Hotel : నిజామాబాద్‌లో దారుణం.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

నిజామాబాద్‌లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్‌ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండు వారాలుగా హోటల్‌లోనే ఉంటున్నారు. అయితే తల్లీ, ఇద్దరు పిల్లలు పురుగుల మందు తాగారు. సూర్యప్రకాశ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Family Suicide In Hotel : నిజామాబాద్‌లో దారుణం.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Family Suicide In Hotel : నిజామాబాద్‌లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్‌ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండు వారాలుగా హోటల్‌లోనే ఉంటున్నారు. అయితే తల్లీ, ఇద్దరు పిల్లలు పురుగుల మందు తాగారు. సూర్యప్రకాశ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

మొదట భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి.. ఆ తర్వాత సూర్యప్రకాశ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూర్యప్రకాశ్‌ హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు.

Krishna District : అప్పుల బాధతో చేనేత కుటుంబం ఆత్మహత్య

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వ్యాపారంలో నష్టాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.