Hyderabad Blast : హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు కలకలం రేపింది. స్నో వరల్డ్ సమీపంలోని డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad Blast : హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Hyderabad Blast : హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు కలకలం రేపింది. స్నో వరల్డ్ సమీపంలోని డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొడుకు సురేశ్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడులో గాయపడిన తండ్రీ కొడుకులది (చంద్రన్న, సురేశ్) కర్నూలు జిల్లాగా గుర్తించారు.

Also Read..Kukatpally Bike Accident : షాకింగ్ వీడియో.. ప్రాణం తీసిన అతివేగం, హైదరాబాద్ కూకట్‌పల్లిలో బైకర్ స్పాట్ డెడ్

పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్‌ ఆధారాలు సేకరించింది. పేలుడు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పెయింట్ డబ్బాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేలుడికి ఆ డబ్బాలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Also Read..Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

ఈ పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు.

గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ పేలుడు ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నారు. పేలుడు ఎలా సంభవించింది? కారణం ఏంటి? అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. క్లూస్ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. డంపింగ్ యార్డులో కెమికల్ తో కూడిన వేస్టేజ్ ఉండొచ్చని, దాని వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఒకరికి పూర్తిగా చెయ్యి కట్ అయిపోయింది. కెమికల్ కు సంబంధించిన వేస్టేజ్ నంతా కూడా అక్కడ స్టోర్ చేస్తుంటారు. దాంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చెత్త ఏరుకునే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని బాధితులు పోలీసులతో చెప్పారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి చెయ్యి పూర్తిగా కట్ అయ్యింది. మంటలు చెలరేగడంతో మరో వ్యక్తికి శరీరం పూర్తిగా కాలింది.