ఈ దొంగ స్టైలే వేరు.. నోయిడా నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తాడు, పనయ్యాక ఫ్లైట్‌లోనే వెళ్లిపోతాడు

  • Published By: naveen ,Published On : September 18, 2020 / 05:52 PM IST
ఈ దొంగ స్టైలే వేరు.. నోయిడా నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తాడు, పనయ్యాక ఫ్లైట్‌లోనే వెళ్లిపోతాడు

ఛత్తీస్ గఢ్ కు చెందిన గంగాధర్ అనే దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కానీ ఈ దొంగ అందరిలాంటోడు కాదు. ఇతడి వివరాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. ఇతడో హైటెక్ దొంగ. దర్జాగా ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తాడు. చోరీ చేశాక అంతే దర్జాగా ఫ్లైట్ లో వెళ్లిపోతాడు.

నిందితుడి నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిర్మానుష్య ప్రదేశాల్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడతాడని తెలిపారు. మరో విశేషం ఏంటంటే, నిందితుడు నోయిడాలో పని చేస్తాడు. దొంగతనం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కాడు. నోయిడా నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తాడు. చోరీ చేసిన వెంటనే మళ్లీ ఫ్లైట్ లో నోయిడా వెళ్లిపోతాడని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.