KTR : టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ప్లేస్ కేటీఆర్‌దేనా..?

టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ప్లేస్ కేటీఆర్‌దేనా? పెద్దబాస్ పార్టీ సమావేశాలకు హాజరుకాకపోతే చిన్నబాసే వాటిని నిర్వహిస్తారా? టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన పార్టీ నియమావళి సవరణలు ఇవేనా?

KTR : టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ప్లేస్ కేటీఆర్‌దేనా..?

Ktr (1)

KTR‌ Key role‌ in trs party : టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ప్లేస్ కేటీఆర్‌దేనా? పెద్దబాస్ పార్టీ సమావేశాలకు హాజరుకాకపోతే చిన్నబాసే వాటిని నిర్వహిస్తారా? టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన పార్టీ నియమావళి సవరణలు ఇవేనా? తారక రాముడి పట్టాభిషేకానికి గులాబీ బాస్ లైన్ క్లియర్ చేసినట్లేనా? టీఆర్‌ఎస్‌ ప్లీనరీతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ మరింత పెరిగింది. కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది. అయితే ఈ ప్లీనరీలో పార్టీ నిబంధనావళిలో చేసిన సవరణలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆ సవరణలే హాట్‌టాపిక్‌గా మారాయి. ఏ నలుగురు కార్యకర్తలు కలిసినా దానిపైనే చర్చించుకుంటున్నారు.

రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి పార్టీ నియమావళిలో మూడు కీలక సవరణలను ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు… జిల్లా, నియోజకవర్గ కార్యకవర్గాలను నియమించే అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెట్టారు. ఇక పార్టీ అధ్యక్షుడు సమావేశాలకు హాజరుకాలేకపోతే.. కార్యనిర్వాహక అధ్యక్షుడే ఆయా సమావేశాలను నడిపించేలా మరో కీలక సవరణ చేశారు. అంటే కేసీఆర్‌ సమావేశాలకు హాజరుకాని పక్షంలో… ఆ సమావేశాన్ని కేటీఆర్‌ నడించనున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చకు దారి తీసింది.

Huzurabad : హుజూరాబాద్‌ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు

కేసీఆర్‌ తర్వాత కేటీఆరే నాయకుడన్న ప్రచారం పార్టీలో ఎన్నో రోజులుగా జరుగుతోంది. పార్టీ నియమావళిలో చేసిన సవరణ ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. కేటీఆర్‌కు పార్టీపై విస్తృత అధికారాలు అప్పగించేందుకే ఈ సవరణ చేశారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ తనయుడిగా.. సీఎం వారసుడిగా ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో కేటీఆర్‌ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మొదటిసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం మంత్రిగానే ఉన్న కేటీఆర్‌కు…. రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత.. కేసీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను కట్టబెట్టారు.

పార్టీపరంగా, అటు ప్రభుత్వం పరంగానూ కేటీఆర్‌ను ఒక్కోమెట్టు ఎక్కిస్తూ వస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించేలా పావులు కదుపుతున్నారు. కేటీఆర్‌ సైతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీరోల్‌ పోషిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఆరు నెలల క్రితం సీఎం హోదాలో నిర్వహించాల్సిన మంత్రులు, అధికారుల సమావేశాన్ని కేటీఆర్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు పావులు కదిపారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నిక…నేటితో ప్రచారానికి తెర

ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాలనూ అన్నీ తానై నడిపారు కేటీఆర్‌. సీఎం కేసీఆర్‌ ప్రకటనలు చేయడం తప్ప… పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్లీనరీలో చేసిన సవరణ కేటీఆర్‌ను మరోమెట్టు ఎక్కించింది. కొత్తగా వచ్చిన అధికారంతో కేటీఆర్‌ పార్టీలో మరింత పవర్‌ఫుల్‌గా మారుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. గులాబీ బాస్‌ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం.. ఇకనుంచి కేటీఆర్‌ పరిధిలోనే జరిగిపోతాయన్న వాదన మొదలైంది.