KTR :గ్యాస్ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్ చేశారు: మంత్రి కేటీఆర్

గ్యాస్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రేట్లు డబుల్ చేశారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్.

KTR :గ్యాస్ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్ చేశారు: మంత్రి కేటీఆర్

Ktr

KTR: గ్యాస్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రేట్లు డబుల్ చేశారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారని, ఇప్పుడా ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. వరంగల్‌లోని నర్సంపేటలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్

ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన నర్సంపేట ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధివైపు పయనిస్తోందన్నారు. ‘‘వెనుకబడిన నర్సంపేట ప్రాంతానికి గోదావరి జలాలు అందించి, పాకాల సరస్సు, రంగయ్య చెరువును నిండుకుండలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుంది. దేశంలో ఒకవైపు గ్యాస్ ధర కొండెక్కితే.. నర్సంపేటలో మాత్రం ఆడబిడ్డల సౌఖ్యం కోసం తక్కువ ధరకే గ్యాస్ ఇంటింటికీ చేరేలా చేసిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిదే. ఈ అవకాశం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కానీ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కానీ, మంత్రుల నియోజకవర్గాల్లో కానీ లేదు. గతంలో దొంతి మాధవరెడ్డి లాంటి దొంగలు ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Telangana : కేసీఆర్ తప్ప..ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? : KTR

మరోవైపు తెలంగాణలో జరుగుతున్నఅభివృద్ధి గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణను కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించాం. ప్రస్తుతం కరెంటు కోతలు లేకుండా తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. త్వరలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం’’ అని వివరించారు.