Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయం.. ఆ పార్టీలో చేరితే కేసులు మాఫీ..

Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.

Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయం.. ఆ పార్టీలో చేరితే కేసులు మాఫీ..

Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లలో ఓక్క బీజేపీ నేతపై కూడా సీబీఐ, ఈడీ కేసు నమోదు కాలేదని గుర్తు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ పై 30 ఏళ్లుగా కక్ష సాధింపు జరుగుతూనే ఉందని, ఇప్పుడు ఆయన వారసులపై కూడా కేసులు పెడుతున్నారని అన్నారు.

బీజేపీలో చేరితే కేసులు మాఫీ
సీబీఐ, ఈడీ సంస్థలు నరేంద్ర మోదీ అమ్ములపొదిలోని ఆయుధాలని కూనంనేని పేర్కొన్నారు. బీజేపీలో చేరితే కేసులు మాఫీ అయిపోతాయని.. కల్వకుంట్ల కవిత, మనీశ్ సిసోడియా బీజేపీకి లొంగిపోయివుంటే కేసులు ఉండవని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసే అవినీతి తట్టుకోలేక.. ఆ పార్టీ నేతలే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్దీదే అధికారం
చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వాలనేది తమ జాతీయ పార్టీ విధామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

Also Read: కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?

ప్రభుత్వానికి భాధ్యత లేదా?
TSPSC  పేపర్ లీక్ తో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆందోళన చెందారు. “దేశంలో పేపర్ లీకేజీ అనేది రుగ్మతగా తయారయింది. భయం లేకే పేపర్ లీకేజీ జరుగుతుంది. కఠిన శిక్షలు ఉండాలి. పరీక్ష రద్దు సరైంది కాదు. ఇంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో 90 మార్కుల పైన వచ్చిన వారిని విచారణ చేయండి. ఇంత జరుగుతుంటే ఛైర్మన్ నిద్రపోతున్నాడా, రాష్ట్ర ప్రభుత్వానికి భాధ్యత లేదా? జరిగిన దానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల”ని డిమాండ్ చేశారు.

Also Read: టీ‌ఎస్‌పీఎస్‌సీకి నీకు సంబంధం లేదా కేటీఆర్.. ఇద్దరికి మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ ఎలా తెలిశాయి..?

25 నుంచి ప్రజాపోరు యాత్ర
విభజన చట్టం ప్రకారం ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కూనంనేని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కుంటి సాకులు చెబుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు చేయాలన్న డిమాండ్ తో బయ్యారం నుంచి హన్మకొండ వరకు ప్రజా పోరు యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 9న తెలంగాణ సీపీఎం, సీపీఐ పార్టీల మండల స్థాయి నాయకులతో సంయుక్త సమావేశం హైదరాబాద్ లోనిర్వహించి.. వచ్చే ఎన్నికల ఎజెండాను కరారు చేస్తామని వివరించారు.