YS Sharmila: టీ‌ఎస్‌పీఎస్‌సీకి నీకు సంబంధం లేదా కేటీఆర్.. ఇద్దరికి మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ ఎలా తెలిశాయి..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబం‌ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

YS Sharmila: టీ‌ఎస్‌పీఎస్‌సీకి నీకు సంబంధం లేదా కేటీఆర్.. ఇద్దరికి మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ ఎలా తెలిశాయి..?

YS Sarmila

YS Sharmila: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబం‌ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగం లేక చనిపోతున్న అని నవీన్ ఆత్మహత్య చేసుకోవటం బాధను కలిగించిందని అన్నారు. తెలంగాణ‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, తొమ్మిదేళ్లుగా తెలంగాణ‌ ప్రభుత్వం పట్టించుకోక‌పోతే తారాస్థాయి‌కి చేరిందని అన్నారు. 55లక్షల మంది తెలంగాణ యువత నిరుద్యోగం‌తో ఇబ్బంది పడుతున్నారని షర్మిల అన్నారు. నిరుద్యోగం‌లో తెలంగాణ నెంబర్ 1 లో ఉందని, ఇక బంగారు తెలంగాణ ఎక్కడ ఉందంటూ సీఎం కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వల్ కమిటీ ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే కనీసం ప్రైవేట్ ఉద్యోగం ఉంటే నవీన్ బతికే వాడని అన్నారు.

YS Sharmila Complaint : బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

10లక్షల మంది కార్పొరేషన్‌ లోన్లు అప్లై చేసుకుంటే ఎందుకు ఇవ్వడం లేదని షర్మిల ప్రశ్నించారు. కేసీఅర్‍కి ఏం చేతనైంది, సెక్రటరేట్ పోవడం లేదు, రుణమాఫీ, మహిళ రుణాలు, ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఏమయ్యాయని షర్మిల ప్రశ్నించారు. చాలా మంది యువత సుసైడ్ నోట్ రాసి మరి చనిపోతున్నారని, యువకుల చావులు అన్ని ప్రభుత్వ హత్యలేనని అన్నారు. తల్లిదండ్రులు చదివించి తప్పు చేశాము అని భాద పడుతున్నారని, బంగారు తెలంగాణ‌లో ఉద్యోగాలు ఎక్కడ పోయాయని అన్నారు. బంగారు తెలంగాణ కాదు బీర్ల, బార్ల తెలంగాణ‌గా మారిందంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

అసెంబ్లీ సాక్షిగా కేసీఅర్ 88వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 26 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడని, అందులోనూ 8వేల ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించారని, కేసీఅర్ 420 మోసగాడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగం ఉందంటే.. హమాలీ పని చేసుకోవాలని నిరంజన్ అనే మంత్రి అన్నాడు, మంత్రి కేటీఆర్ నాకే సంబధం అంటున్నారు, టి‌ఎస్‌పీఎస్‌సీ‌కి నీకు సంబధం లేదా కేటీఆర్ అంటూ షర్మిల ప్రశ్నించారు. ఐటీ మంత్రి‌గా నీకు తెలియదు అనడం సిగ్గుచేటని, ఇద్దరికీ మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ అందరికీ ఎలా తెలిశాయని అన్నారు.

YS Sharmila Arrested: వైఎస్ షర్మిల మౌనదీక్ష భగ్నం.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు

మంత్రి కేటీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నానని, రెండు లక్షల మంది‌కి ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు.. బేషరతుగా వైట్ పేపర్‌పై రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకొకరు ఉద్యోగం‌కోసం ఆత్మబలిదానం కాకూడదని, సిరిసిల్ల‌నే లాస్ట్ కావాలని షర్మిల అన్నారు.