Lizard In Bawarchi Biryani : బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి

బావర్చిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. సగం బిర్యానీ తిన్న తర్వాత బల్లిని చూసి కంగుతిన్నారు.

Lizard In Bawarchi Biryani : బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి

Lizard In Bawarchi Biryani

Lizard In Bawarchi Biryani : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి హోటల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బావర్చి హోటల్.. బిర్యానీకి చాలా ఫేమస్. అక్కడ బిర్యానీ ఎంతో టెస్టీగా ఉంటుందంటారు ఫుడ్ లవర్స్. బావర్చి బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుని మరీ తినేస్తారు. ప్రత్యేకంగా బావర్చి హోటల్ కి వెళ్లి మరీ బిర్యానీ లాగిస్తుంటారు. అయితే, అలాంటి బావర్చి బిర్యానీలో బల్లి కనిపించడం షాక్ కి గురి చేసింది.

రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి బావర్చి హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తెప్పించుకున్నారు. సగం తిన్నాక, షాకింగ్ సీన్ కనిపించింది. బిర్యానీలో బల్లిని చూసి కంగుతిన్నారు. బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే దాన్ని తన ఫోన్ లో రికార్డ్ చేశారు.

McDonald’s : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత

దీనిపై కార్పొరేటర్ రవిచారి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఆ బిర్యానీ శాంపుల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కి పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. బావర్చి హోటల్ లో తనిఖీలు చేశారు. ఫుడ్ శాంపిల్స్ ను కూడా సేకరించారు.

బిర్యానీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. అందులోనూ బావర్చి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ అన్నది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ వెళ్లే బిర్యానీ ప్రియులు.. బావర్చి బిర్యానీ రుచి చూడకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, బిర్యానీలో బల్లి కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. హోటల్ లో పాటించే నాణ్యతా ప్రమాణాలపై సందేహాలు వస్తున్నాయి. హోటల్స్ లో పరిశుభ్రత పాటించడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బిర్యానీలో బొద్దింకలు, పురుగులు వచ్చాయి.

కుళ్లిన చికెన్ తో బిర్యానీ : బావర్చి హోటల్ కు జరిమానా

కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బిర్యానీలో బొద్దింకలు, పురుగులు వచ్చాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కుళ్లిపోయిన చికెన్, బిర్యానీ వడ్డించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం, నామ మాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.