లాక్‌డౌన్ తొలగించనున్న మహారాష్ట్ర

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 12:00 PM IST
లాక్‌డౌన్ తొలగించనున్న మహారాష్ట్ర

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే తాము లాక్‌డౌన్ ఎత్తేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. రాష్ట్రంలో జోన్ల వారీగా సడలిస్తామని..  నియమాలు ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ‘వెంటనే రిలాక్సేషన్ ఇవ్వలేం. ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. లాక్‌డౌన్ సడలించడమనేది ఎవ్వరికీ నచ్చడం లేదు’

‘ప్రత్యేకించి ముంబై, పూణె ప్రాంతాలు, నాగ్ పూర్, ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆరంజ్ జోన్లలో కొత్త కేసులు లేవు. అయినా యాక్టివ్ కేసులు రన్ అవుతున్నాయి. గ్రీన్ జోన్లలో కేసుల సంఖ్య సున్నాగానే ఉంది. గ్రీన్ జోన్లకు కూడా మరో అవకాశం ఇవ్వాలని అనుకోవడం లేదు. దశల వారీగా మాత్రమే దీనిని సడలిస్తాం’ అని ఆయన చెప్పారు.(లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తే..ప్రజలు..ప్రభుత్వాలు ఏం చేయాలి ? )

రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ప్రజలకు నిజమైన సంపద ఆరోగ్యమే. ప్రజలు క్షేమంగా ఉండడమే కావాల్సింది. కొవిడ్-19 అనే భయం పూర్తిగా నిండిపోయింది. దానిని మనం జయించాలి. త్వరగా దానిని కనుక్కోగలిగితే తగ్గించుకోలమనే విషయం తెలుసుకోవాలి’ అని అన్నారు. 

వైరస్ వ్యాప్తిలో లాక్‌డౌన్ అనేది ఓ స్పీడ్ బ్రేకర్ లా పనిచేసిందని.. వేగంగా టెస్టులు చేయడం వల్లనే యాక్టివ్ కేసులు మరిన్ని పెరిగాయని ఆయన అన్నారు. రాష్ట్ర 60వ ఫౌండేషన్ డేను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.