Drunk and Drive : ప్రాణాలు తీస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్

ఫుల్లుగా తాగినప్పుడు మనిషి సరిగ్గా నడవనేలేడు. మాట సైతం సరిగ్గా రాదు. అదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి స్థితిలో వాహనం ఎలా నడుపుతారు...?

Drunk and Drive : ప్రాణాలు తీస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్

Drunk And Drive

Drunk and Drive Road accidents : అసలు తాగడమే తప్పు…..మోతాదుకు మించి తాగడం ఇంకా పెద్ద తప్పు….అది చాలదన్నట్టు….ఒళ్లు తెలియని మైకంలో రోడ్డెక్కడం….క్షమించలేని తప్పు. ఈ తప్పులన్నింటి పర్యవసానం నూరేళ్ల జీవితం. ఆవహించిన మత్తు, అంతులేని నిర్లక్ష్యం, అపరిమిత వేగం….రహదారులపై మరణ మృదంగం మోగిస్తున్నాయి. నెత్తుటేరులు పారిస్తున్నాయి. నిలువునా నిండు ప్రాణాలు తీస్తున్నాయి. పదిరోజుల క్రితం బంజారాహిల్స్‌లో, ఇవాళ గచ్చిబౌలిలో జరిగింది ఇదే. ..తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్..ప్రాణాలు తీసే రక్కసిగా మారుతోంది. అయినా ప్రజలకు బుద్ధిరావడం లేదు.

తాగి వాహనం నడపకూడదు…ప్రభుత్వాలు, పోలీసులు ఈ విషయాన్ని నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నాయి. వాహనదారుల కుటుంబ సభ్యులు కూడా ఇంటి నుంచి బయలుదేరేముందు… తమవారికి ఈ విషయాన్ని పదే పదే చెబుతారు. బాధ్యతగా ఉండాలని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో పోలీసులూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాగి వాహనం నడుపుతూ దొరికిపోయినవారిపై కేసులు నమోదుచేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా సరే మందుబాబుల వైఖరిలో వీసమెత్తు మార్పు కన్పించడం లేదు.

CM KCR : త్వరలోనే దళితబంధు నిధులు విడుదల : సీఎం కేసీఆర్

ఫుల్లుగా తాగినప్పుడు మనిషి సరిగ్గా నడవనేలేడు. మాట సైతం సరిగ్గా రాదు. అదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి స్థితిలో వాహనం ఎలా నడుపుతారు…? అసలు ఆ పరిస్థితుల్లో వాహనం నడపాల్సిన అవసరం ఏంటి..? అదీ అపరిమితవేగంతో దూసుకుపోవడం ఎందుకు…? ప్రాణాలు పోగొట్టుకోవడమో.. అమాయకుల ప్రాణాలు తీయడమో తప్ప..చివరకు ఏం మిగులుతోంది..? మూమూలుగానే రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

వేగం నియంత్రించుకోవాలి. వెనకా,ముందూ వచ్చే వాహనాలు గమనించుకుంటూ ఉంటాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఏ మూల ప్రమాదం పొంచి ఉందో అర్ధం కాదు. అలాంటిది మత్తులో మునిగితేలుతూ స్టీరింగ్ పట్టుకోవడం, నియంత్రణ కోల్పోవడం అవసరమా…? అంటే వద్దనే అందరూ చెబుతారు. కానీ మందుబాబులకు మాత్రం ఇది తలకెక్కడం లేదు. జీవితం ఎంత విలువైనదో….ప్రాణాలు ఎంత అమూల్యమైనవో అర్ధంకావడం లేదు.

CM KCR : యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనడంలేదు : సీఎం కేసీఆర్

15 రోజుల క్రితం బంజారాహిల్స్‌లో ఇలాగే అర్ధరాత్రి దాకా మద్యం సేవించి..వాహనం నడిపి రెండు నిండు ప్రాణాలు తీశారు మందుబాబులు. ఒకేరోజు హైదరాబాద్‌లోనే వేర్వేరు చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి..అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలు మర్చిపోకముందే…ఈ ఉదయం గచ్చిబౌలీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద తీవ్రత అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వాయువేగంతో వచ్చి….చెట్టును ఢీకొట్టిన కారు…రెండు ముక్కలైందంటే…ఆ సమయంలో కారు వేగం ఏ స్థాయిలో ఉందో…వాహనం నడుపుతున్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.

షూటింగ్ కోసం వచ్చి…..వచ్చిన పని మర్చిపోయి…ఎంజాయ్‌మెంట్ కోసం మద్యం సేవించి…..ఆ మత్తులోనే టీ తాగడానికి బయలుదేరారు కారులోనివారు. చెట్టును ఢీకొట్టిన వెంటనే…కారులోని ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మద్యం తాగని సాయిసిద్ధు ఒక్కడే ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు. ప్రమాదం తర్వాత కారు నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చింది. వరుస ప్రమాదాలు చూసైనా మందుబాబులు కళ్లు తెరవాలని పోలీసులు అంటున్నారు.