Mallu Ravi : ఆ మంత్రి చెప్పినట్లే సిట్ పని చేస్తోంది, ఇది బీజేపీ-బీఆర్ఎస్ డ్రామా-మల్లు రవి

Mallu Ravi: Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Mallu Ravi : ఆ మంత్రి చెప్పినట్లే సిట్ పని చేస్తోంది, ఇది బీజేపీ-బీఆర్ఎస్ డ్రామా-మల్లు రవి

Mallu Ravi(Photo : Google)

Mallu Ravi : Tspsc పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ చెప్పినట్లే సిట్ పని చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. చూస్తుంటే.. సిట్ కు చైర్మన్ కేటీఆర్ లా ఉందన్నారు. సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయో? కేటీఆర్ కు ఎలా తెలుసు అని మల్లు రవి ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ డ్రామా నడుస్తోందన్నారు మల్లు రవి.

Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్.. తన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా కోర్టుకి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు.(Mallu Ravi)

Also Read..TSPSC paper leak: అప్పటి నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి: బీజేపీ

అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టామన్న మల్లు రవి.. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు నిరసన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుతోందని ఆయన అన్నారు.

Also Read..TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం, సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సిట్ నివేదిక

మరోవైపు తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసుని విచారించిన సిట్.. తన దర్యాఫ్తు నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది.

250 పేజీల రిపోర్ట్స్, ఎంక్లోజర్స్ ని కోర్టులో దాఖలు చేశారు పోలీసులు. 18 పేజీల ఇన్విస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్ ని సిట్ హైకోర్టులో సబ్మిట్ చేసింది. పేపర్ లీకేజీలో రూ.40లక్షల నగదు బదిలీ జరిగినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించింది సిట్. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్ లదే అని సిట్ తేల్చింది. టీఎస్ పీఎస్ సీ మెంబర్, చైర్మన్ విచారించినట్లు తెలిపింది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు.. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లపై తన రిపోర్టులో వివరణ ఇచ్చింది సిట్.

గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసులను విచారించామని సిట్ గుర్తు చేసింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులోనూ పటిష్ట దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తన రిపోర్టులో పేర్కొంది సిట్.

”Tspsc పేపర్ లీక్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సిట్ తన నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించింది. కోర్టు తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా పడింది. నిరుద్యోగుల పక్షాన జడ్జిమెంట్ వస్తుందని భావిస్తున్నాం” అని NSUI ప్రెసిడెంట్ వెంకట్ తెలిపారు. 18న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే దీక్షలో పాల్గొనాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు వెంకట్.