Man Shoot Lizard : గోడ మీద బల్లిపై గన్ తో కాల్పులు

హైదరాబాద్‌ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్‌పురాలోని సుల్తాన్‌షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్‌షాహీకి చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.

Man Shoot Lizard : గోడ మీద బల్లిపై గన్ తో కాల్పులు

Man shoots lizard

Man shoots lizard : హైదరాబాద్‌ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్‌పురాలోని సుల్తాన్‌షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్‌షాహీకి చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.

అయితే ఆ బుల్లెట్‌ గోడకు తగలడంతో కొంత పెచ్చు ఊడి అక్కడే ఉన్న ఆజాన్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.

Girl Raped : స్కూల్‌కు వెళ్తున్న బాలికపై అత్యాచారం..పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.