Puvvada Ajay Kumar: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారు: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథకం పేరుతో మహిళలకు గ్యాస్ అలవాటు చేసి, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచారు.

Puvvada Ajay Kumar: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారు: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Puvvada Ajay Kumar: బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని, 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని విమర్శించారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గ్యాస్ ధరల పెంపుపై పువ్వాడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

‘‘గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథకం పేరుతో మహిళలకు గ్యాస్ అలవాటు చేసి, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచారు. రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు గ్యాస్ ధరలు పెంచరు. మేఘాలయ, త్రిపురల్లో ఎన్నికలు ముగియగానే ధరలు పెంచారు. దేశం మొత్తానికి అదానీయే గ్యాస్ సరఫరా చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేసేలా మోదీ ప్రయత్నిస్తున్నారు.

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఎవరైనా గొంతెత్తితే వారిపై సీబీఐతో దాడులు చేయిస్తోంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాల్ని కూల్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వాళ్ల కుట్రలను భగ్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్‌ను రేవంత్ రెడ్డి రూ.500కే అందించాలి. కాంగ్రెస్ పార్టీ మోదీని ఎదుర్కోలేకపోతోంది. ఎల్ఐసీని అదానీ కంపెనీలో మోదీ పెట్టుబడులు పెట్టించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.

బండి సంజయ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? జన్‌ధన్ ఖాతాలో డబ్బులెందుకు వేయడం లేదు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచి కేంద్రం మహిళల నడ్డి విరిచింది. పెంచిన ధరల్ని కేంద్రం వెంటనే తగ్గించాలి. 2014లో ఉన్న ధరకే గ్యాస్ ఇవ్వాలి. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’’ అని పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.