YS Sharmila : నిరంకుశ చర్య.. రాహుల్ గాంధీకి షర్మిల మద్దతు, మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం

ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని విమర్శించారు.(YS Sharmila)

YS Sharmila : నిరంకుశ చర్య.. రాహుల్ గాంధీకి షర్మిల మద్దతు, మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం

YS Sharmila : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అండగా నిలిచారు. మోదీ సర్కార్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు దురదృష్టకరం అన్నారు షర్మిల. ఇది అప్రజాస్వామికం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్ డే అని విమర్శించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం తగదన్నారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఉన్నా.. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అంటూ విమర్శించారు షర్మిల. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు షర్మిల. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవన్నారు షర్మిల.

రాహుల్ పై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నాయి. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే లోక్‌సభలో రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు నేతలు. ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Also Read..Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటిరోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాలపై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరముందన్నారు.(YS Sharmila)

రాహుల్ గాంధీపై అనర్హత వేటు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ వెంటనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్‭సభకు అనర్హుడయ్యాడు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేశారు. ఇప్పటికిప్పుడే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.(YS Sharmila)

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను లోక్ సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు. మోదీ (ఇంటిపేరు) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ప్రజాప్రతినిధి(ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురైతే వారు చట్టసభలకు అనర్హతకు గురవుతారు. ఈ నిబంధన ప్రకారమే రాహుల్ పై అనర్హత వేటు వేశారు.

Also Read..Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్

రాహుల్ ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

2019 కర్నాటక ఎన్నికల సమయంలో మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన కేసును నాలుగేళ్లుగా విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ కు జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పీల్ కు వెళ్లడానికి 30 రోజుల గడువు విధించింది. అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క రోజు వ్యవధిలోనే లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆయన లోక్ సభ సభ్యత్వం చెల్లుబాటు కాదని ప్రకటించడం సంచలనం రేపింది.

“కేరళలోని వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంచి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. వాస్తవానికి సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ ఇప్పటికే పైకోర్టుని ఆశ్రయిస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది. అయితే ఆలోపే లోక్‭సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.