Revanth Reddy On Undavalli : ఉండవల్లి.. కేసీఆర్ హనీ ట్రాప్‌లో పడ్డారు-రేవంత్ రెడ్డి

కేసీఆర్ బీజేపీపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు?(Revanth Reddy On Undavalli)

Revanth Reddy On Undavalli : ఉండవల్లి.. కేసీఆర్ హనీ ట్రాప్‌లో పడ్డారు-రేవంత్ రెడ్డి

Revanth Reddy On Undavalli

Revanth Reddy On Undavalli : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాజీ ఎంపీ, రాజకీయ విమర్శకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ కావడం, బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉందని చెప్పడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఉండవల్లి, కేసీఆర్ భేటీపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఉండవల్లి అరుణ్ కుమార్.. కేసీఆర్ హనీ ట్రాప్ లో పడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం ఉండవల్లి పోరాడారనే గౌరవం ఉండేదని, ఈ భేటీతో అది పోయిందన్నారు. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో తెలియదు కానీ.. కేసీఆర్ పంచన చేరి ఆయన భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లి పైనున్న గౌరవం పోయిందన్నారు రేవంత్ రెడ్డి.(Revanth Reddy On Undavalli)

Revanth Reddy National Herald : నాడు ఇందిర, నేడు సోనియా.. 2024లో రిపీట్ కాబోతోందన్న రేవంత్ రెడ్డి

కేసీఆర్ బీజేపీపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని రేవంత్ రెడ్డి అడిగారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారని, ఆ రెండు పుస్తకాల్లోనూ తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ను ఉండవల్లి విమర్శించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ తన ఇంటికి పిలిచి కలిసి పని చేయమంటరా? అని మండిపడ్డారు.

Undavalli Arun Kumar : బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉంది : ఉండవల్లి

అడ్డా మీద కూలీ లా మారి కేసీఆర్ తో కలవద్దని.. ఉండవల్లికి హితవు పలికారు రేవంత్ రెడ్డి. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే.. తెలంగాణ సమాజం ఊరుకోదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తారని వస్తున్న వార్తలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. సారా పాతదే, సీసా కొత్తది అన్నట్లుగా వ్యవహారం ఉందని విమర్శించారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లంతా బీహార్ వాళ్లే అన్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ కాదు అది బీహార్ పార్టీ అని విమర్శించారు.

Revanth Reddy Warns BJP : మిత్తితో సహా చెల్లిస్తాం, జైలుకెళ్లక తప్పదు- బీజేపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్