CM KCR : ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ రద్దు : సీఎం కేసీఆర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్‌ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు.

CM KCR : ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ రద్దు : సీఎం కేసీఆర్‌

Kcr (1)

CM KCR announced : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వస్తే… తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందుకెళ్తానని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అధికారం కోసం ఏక్‌నాథ్‌ షిండేలను పుట్టించాలా అని నిలదీశారు. మున్ముందు ఏక్‌నాథ్‌ షిండేలే ఏకుమేకులవుతారని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. బీజేపీలాగా తాము కుంభకోణాలు చేయలేదన్నారు కేసీఆర్‌.

ప్రజల కోసం మంచి పనులు చేశామని.. ఆ ప్రజలే తమను గెలిపిస్తారన్న దీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఫైర్‌ అయ్యారు. బీజేపీకి, మోదీకి దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులోని ప్రభుత్వాలను పడగొట్టాలని సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలోలాగా.. తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను తీసుకురావాలని అన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణకు మోదీ పైసా సాయం చేయకున్నా… అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

CM KCR : మోదీ.. అవివేక, అసమర్థత పాలన : సీఎం కేసీఆర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్‌ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు. తమతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టేనని సీఎం కేసీఆర్ వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రధాని మోదీ తమను గోకకపోయినా.. తాను మాత్రం గోకుతూనే ఉంటానని హెచ్చరించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని.. విప్లవ బాటలో పయనించాలన్నారు. దేశంలో కొత్త పార్టీ రావద్దా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుందని స్పష్టం చేశారు. మోదీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని.. ప్రజలకు వివరిస్తామన్నారు. తప్పకుండా మోదీని దోషిగా నిలబెడతామని కేసీఆర్‌ అన్నారు.