Komatireddy : దటీజ్ కాంగ్రెస్..ఒకే వేదికపై రేవంత్ – కోమటిరెడ్డి..సరదాగా మాట్లాడుకున్నారు
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి...కోమటిరెడ్డిని తీసుకొచ్చారు.

Vari Deeksha : వరి కొనుగోళ్ల విషయంలో టి.కాంగ్రెస్ నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. అందులో భాగంగా…ఇందిరాపార్క్ వద్ద 2021, నవంబర్ 27వ తేదీ శనివారం వరి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీక్ష శిబిరానికి పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా వచ్చారు.
Read More : TTD Sarva Darshna Tickets : మూడు లక్షల టికెట్లు 16 నిమిషాల్లో అయిపోయాయి
స్టేజీపైకి ఎక్కిన ఆయన రేవంత్ వైపు చూడకుండా పక్కకు వెళ్లిపోయారు. అయితే..అక్కడే ఉన్న మరో సీనియర్ నేత వీహెచ్ దీనిని చూసి…కోమటిరెడ్డిని తీసుకొచ్చారు. రేవంత్..కోమటిరెడ్డిలు పక్కపక్కనే కూర్చొబెట్టారు. వారు కలిసిపోవడం..మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకరిపై ఒకరు జోకులు కూడా పేల్చుకున్నారు.
Read More : Massive Fraud : అధిక వడ్డీల పేరుతో రూ.200 కోట్లు మోసం..బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు
కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఏమి చెప్పలేరు. అప్పటి వరకు కలిసి తిరిగిన నాయకులు ఎప్పుడు విడిపోతారో తెలియదు. సొంత నాయకులపైనే కన్నెర్ర చేస్తారు. విమర్శలు గుప్పిస్తుంటారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందంటూ కామెంట్స్ చేస్తుండడంతో హాట్ హాట్ చర్చలు జరుగుతుంటాయి. పార్టీ అధిష్టానం మొట్టికాయలతో మళ్లా లైన్ లోకి వస్తుంటారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు, ఇతర నేతలు అలిగిన సంగతి తెలిసిందే. ఆయన నియామకంపై పలువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేశారు. అందులో పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు.
Read More : Heavy Rain Forecast : బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం..మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పార్టీ నాయకులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం..కాంగ్రెస్ ఘోరపరాభవంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి… కామారెడ్డి – ఎల్లారెడ్డి నుండి తన ఉద్యమాన్ని మొదలు పెడతా, తన తడాఖా ఏంటో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో…బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం వరి దీక్షలో రేవంత్..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కలిసి మాట్లాడుకోవడం..షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో…వీరు కలిసిపోయారా ? అనే చర్చ జరుగుతోంది.
- కేసీఆర్‌కు సరైన గుణపాఠం తప్పదన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
- Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్
- Rahul Gandhi : టీఆర్ఎస్తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!
- రాహుల్ రాకతో టీ-కాంగ్రెస్ రాతమారుతుందా..!
1K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
2Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..
3Fake Reviews: ఆన్లైన్ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి
4Kirak RP : కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఫొటోలు
5Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..
6Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
7Delhi IAS Couple : పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ
8Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం
9Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
10Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?